బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన
సిద్దిపేటజోన్: ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా కాంగ్రెస్ పాలకుల్లో మార్పు కలిగించాలంటూ బీఆర్ఎస్ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. గురువారం జిల్లా కేంద్రంలో గాంధీ విగ్రహానికి వినతిపత్రాలు అందించారు. హామీలన్నీ వంద రోజుల్లో అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందంటూ బీఆర్ఎస్ నేతలు పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజనర్స్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేయాలని లేనిపక్షంలో ఉధృతంగా పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలోమున్సిపల్ వైస్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలకుల్లో మార్పు రావాలంటూ గాంధీ విగ్రహానికి వినతులు
Comments
Please login to add a commentAdd a comment