ఇంగ్లండ్‌తో జరిగిన అఖరి టెస్టులో ఓటమి చెందిన టీమిండియా మరో పోరుకు సిద్దమైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇగ్లండ్-భారత్ మధ్య తొలి టీ20 సౌతాంప్టన్ వేదికగా గురువారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లలో ఎవరికి విజయావకాశాలు ఉంటాయన్న దానిపై టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా తన తన అంచనాలను వెల్లడించాడు. తొలి టీ20లో భారత్‌పై ఇంగ్లండ్ విజయం సాధిస్తుందని ఆకాష్ చోప్రా జోస్యం చెప్పాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 15 సిక్స్‌లు నమోదు చేస్తాయి అని చోప్రా తెలిపాడు.
ఇక ఈ తొలి పోరులో రోహిత్ నేతృత్వంలోని ఐర్లాండ్‌తో తలపడిన భారత జట్టు బరిలోకి దిగనుండగా.. నూతన సారథి జోస్ బట్లర్ నాయకత్వంలో పూర్తి స్థాయి టి20 స్పెషలిస్ట్‌లలతో ఇంగ్లండ్ ఆడేందుకు సిద్దమైంది. "ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు జోస్ బట్లర్, డేవిడ్ మలాన్ కలిసి 75 పరుగుల పైగా పరుగలు చేస్తారని నేను భావిస్తున్నాను. ఇంగ్లండ్ గత ఐదు మ్యాచ్‌ల్లో కేవలం రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చెందింది. అయితే ఈ మ్యాచ్‌ల్లో బట్లర్ ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు.
అతడితో పాటు మలాన్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మలాన్ ఈ మ్యాచ్‌లో కూడా అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడుతాడని నేను అనుకుంటున్నాను. ఇక భారత్ విషయానికి వస్తే.. రోహిత్ ఓపెనర్‌గా ఉన్నప్పటికీ.. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ 70 కంటే ఎక్కువ పరుగులు చేస్తారు. అయితే మూడో స్థానంలో శాంసన్ లేదా హుడాలో ఎవరికీ చోటు దక్కుతుందో వేచి చుడాలి. ఇక రెండు జట్లును పోల్చి చేస్తే తొలి టీ20లో భారత్‌పై ఇంగ్లండ్ విజయం సాధించే అవకాశం ఉంది. బౌలింగ్ పరంగా భారత్ పటిష్టంగా ఉంటే.. బ్యాటింగ్ పరంగా ఇంగ్లండ్ పటిష్టంగా ఉంది" అని చోప్రా యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌కు భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను కూడా చోప్రా అంచనా వేశాడు.
ఆకాశ్ చోప్రా అంచనా వేసిన టీమిండియా ప్లేయింగ్ ఎలవెన్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, యుజువేంద్ర చాహల్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, భువనేశ్వర్ కుమార్
చదవండి: IND VS WI T20 Series: కోహ్లిపై వేటు..? విండీస్‌తో టీ20 సిరీస్‌కు కూడా డౌటే..!
Comments
Please login to add a commentAdd a comment