
PC: IPL.COM
టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్యా రహానే ఐపీఎల్-2023ను ఘనంగా ఆరంభించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రహానే సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. తన ఐపీఎల్ కెరీర్‌లోనే సీఎస్‌కే తరపున తొలి మ్యాచ్ ఆడిన రహానే అదరగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో కేవలం 27 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రహానే 7 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 61 పరుగులు చేశాడు. అయితే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను కేవలం 19 బంతుల్లోనే అందుకున్నాడు. తద్వారా పలు అరుదైన రికార్డులను రహానే తన పేరిట లిఖించుకున్నాడు.
రహానే సాధించిన రికార్డులు ఇవే..
ఐపీఎల్-2023లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఆటగాడిగా రహానే రికార్డులకెక్కాడు. అదే విధంగా ఐపీఎల్ చరిత్రలో సీఎస్‌కే తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన రెండో ఆటగాడిగా మొయిన్ అలీతో కలసి రహానే నిలిచాడు. ఈ క్రమంలో 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన సీఎస్‌కే కెప్టెన్ ఎంస్ ధోని రికార్డును రహానే బ్రేక్ చేశాడు. ఐపీఎల్-2012 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై ధోని కేవలం 20 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
తాజా మ్యాచ్‌తో ధోని 11 ఏళ్ల రికార్డును రహానే బద్దలు కొట్టాడు. ఇక ఓవరాల్‌గా సీఎస్‌కే తరపున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు.. ఆ జట్టు మాజీ ఆటగాడు సురేష్ రైనా పేరిట ఉంది. ఐపీఎల్- 2014 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్(పంజాబ్ కింగ్స్)పై రైనా కేవలం 16 బంతుల్లోనే అర్ధశతకం నమోదు చేశాడు.
చదవండి: Ajinkya Rahane: బీసీసీఐ అవసరములేదని పొమ్మంది.. ఆ కసిమొత్తం ఇక్కడ చూపించేశాడు!