IPL 2023, MI Vs SRH: సచిన్‌ కొడుకుతో అట్లుటంది మరి.. శబాష్‌ అర్జున్‌! వీడియో వైరల్‌ | Arjun Tendulkar Picks Up His Maiden IPL Wicket - Sakshi
Sakshi News home page

IPL 2023: సచిన్‌ కొడుకుతో అట్లుటంది మరి.. శబాష్‌ అర్జున్‌! వీడియో వైరల్‌

Published Wed, Apr 19 2023 9:18 AM | Last Updated on Wed, Apr 19 2023 10:11 AM

Arjun Tendulkar Picks His Maiden IPL Wicket - Sakshi

PC: IPL.com

ముంబై ఇండియన్స్‌ యువ పేసర్‌, సచిన్‌ తనయుడు అర్జున్ టెండూల్కర్ తొలి ఐపీఎల్‌ వికెట్‌ను సాధించాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ను ఔట్‌ చేసిన అర్జున్.. తొలి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అర్జున్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

2.5 ఓవర్లు వేసిన అర్జున్ టెండూల్కర్ కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక్క వికెట్‌ పడగొట్టాడు. కాగా ఆఖరి ఓవర్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ విజయానికి 20 పరుగులు అవసరమవ్వగా.. ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బంతిని అర్జున్‌ చేతికి అందించాడు. జానియర్‌ టెండూల్కర్ రోహిత్‌ నమ్మకాన్ని వమ్ము చేయలేదు.

అద్భుతంగా బౌలింగ్‌ చేసి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇదే ఓవర్‌లో ఐదో బంతికి భువనేశ్వర్‌ కుమార్‌ను ఔట్‌ చేయడంతో.. ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఇక ఆడిన రెండో మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన అర్జున్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ముంబైకు డెత్‌ ఓవర్ల స్పెషలిస్టు దొరికాడని పలువురు మాజీలు కొనియాడుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.
చదవండి: IPL 2023 SRH vs MI: నీ ఆటకు ఓ దండం రా బాబు.. వెళ్లి గల్లీ క్రికెట్‌ ఆడుకో పో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement