టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్‌షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ గాయం కారణంగా భారత పర్యటనకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. లండన్ వేదికగా జరిగిన యాషెస్ ఆఖరి టెస్టులో పాట్ కమిన్స్ ఎడమ చేతి మణికట్టు విరిగింది. ఆ గాయం నుంచి కోలుకునేందుకు అతడికి నెల రోజుల విశ్రాంతి అవసరమని వైద్యలు సూచించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్‌కు కూడా సమయం దగ్గరపడతుండడంతో గాయం నుంచి కోలుకున్న తర్వాత కూడా అతడికి విశ్రాంతి ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో వచ్చే నెలలో జరగనున్న దక్షిణాఫ్రికా, టీమిండియా సిరీస్‌లకు కమ్మిన్స్ దూరం కానున్నాడని సిడ్నీ మోర్నింగ్ హెరాల్డ్ తమ కథనంలో వెల్లడించింది. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం కమిన్స్ గాయంపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటన చేయలేదు.
ఇక ఆసీస్ జట్టు సెప్టెంబర్‌లో మూడు వన్డేల సిరీస్ కోసం భారత్‌కు రానుంది. సెప్టెంబర్ 22న మొహాలీ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ వన్డే ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా జరగుతోంది. ఒక వేళ భారత్‌తో సిరీస్‌కు కమ్మిన్స్ దూరం అయితే మిచెల్ మార్ష్ కంగారూ జట్టు పగ్గాలు చెపట్టే అవకాశం ఉంది. కాగా ఈ ఏడాది యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా డ్రాగా ముగించిన సంగతి తెలిసిందే. సిరీస్ డ్రా అయినప్పటికీ యాషెస్ కప్ మాత్రం ఆస్ట్రేలియా వద్ద ఉండనుంది. ఎందుకంటే గత సిరీస్ విజేత ఆస్ట్రేలియానే.
చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో రెండో టీ20.. టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా?
Comments
Please login to add a commentAdd a comment