Babar Azam Pics IND-Pak Joint XI Team.. టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మ్యాచ్ గెలవడం కన్నా దేశ ప్రతిష్టను కాపాడాలని కోరుకునే ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ టి20 ఫార్మాట్‌లో ఇండియా-పాకిస్తాన్ జట్టు సభ్యుల బెస్ట్ ఎలెవెన్ ప్రకటించాడు. తాను ప్రకటించిన ఆల్‌టైమ్ ఎలెవెన్ జాబితాలో పాకిస్తాన్ ఆటగాళ్లకంటే టీమిండియా ఆటగాళ్లే ఎక్కువగా ఉండడం విశేషం. మొత్తం 11 మంది సభ్యుల్లో 6 మంది టీమిండియా నుంచి.. మిగతా ఐదుగురు పాకిస్తాన్ నుంచి ఉన్నారు.
హర్షాబోగ్లేతో జరిగిన ఇంటర్వ్యూలో బాబర్ అజమ్ తన టీమ్‌ను ఎంపికచేశాడు. తనకు జతగా ఓపెనర్‌గా రోహిత్ శర్మ.. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లి, నాలుగో స్థానంలో పాక్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ ఉన్నారు. ఇక వికెట్ కీపర్‌గా భారత మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనిని ఎంపిక చేసిన బాబర్.. ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయడం విశేషం. ఇక స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, షాదాబ్ ఖాన్‌లు ఎంపిక చేసిన పాక్ కెప్టెన్.. పేస్ బౌలర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, షాహిన్ అఫ్రిది, మహ్మద్ అమిర్‌లకు చోటు కల్పించాడు.
ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే టీవీ టీఆర్పీ రేటింగ్స్ బద్దలవ్వాల్సిందే. తాజాగా ముగిసిన టి20 ప్రపంచకప్‌లో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అందుకు నిదర్శనం. ఇకఇక క్రికెట్ చరిత్రలోనే ఈ మ్యాచ్‌ను ఎక్కువగా వీక్షించారని బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ పేర్కొంది. కాగా టీమిండియా, పాకిస్తాన్‌ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ 2012లో జరిగింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడ్డాయి. తాజాగా టి20 ప్రపంచకప్‌లో టీమిండియాపై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఇక బాబర్ అజమ్ టి20 ప్రపంచకప్ 2021లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆరు మ్యాచ్‌లాడిన బాబర్ 303 పరుగులు సాధించి టి20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
బాబర్ అజమ్ ఇండో-పాక్ ఎలెవెన్: బాబర్ అజమ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, షోయబ్ మాలిక్(ఆల్‌రౌండర్), ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా(ఆల్‌రౌండర్), షాదాబ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ అమిర్, షాహిన్ అఫ్రిది
Comments
Please login to add a commentAdd a comment