టీమిండియాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌కు స్టార్ పేసర్ షోర్‌ఫుల్ ఇస్లాం గాయం కారణంగా దూరమయ్యాడు.
షోర్‌ఫుల్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. అతడు కోలుకోవడానికి మరి కొంత సమయం పట్టనున్నట్లు బీసీబీ వెల్లడించింది. ఈ క్రమంలోనే అతడు భారత పర్యటనకు దూరమయ్యాడు.
ఈ జట్టులో అన్‌క్యాప్డ్ ఆటగాడు జాకర్ అనిక్ అలీకి సెలక్టర్లు చోటిచ్చారు. నలుగురు పేసర్లు, నలుగురు స్పిన్నర్లతో కూడిన బలమైన జట్టును బంగ్లా సెలక్టర్లు ఎంపిక చేశారు. పాకిస్తాన్‌పై చారిత్రత్మక విజయం సాధించిన ఆత్మ విశ్వాసంతో బంగ్లా జట్టు భారత గడ్డపై అడుగుపెట్టనుంది.
టీమిండియాపై కూడా తొలి టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకోవాలని బంగ్లా టైగర్స్ పట్టుదలతో ఉన్నారు. ఇక సెప్టెంబరు 19 నుంచి చెన్నై వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
భారత్‌తో టెస్టు సిరీస్‌కు బంగ్లా జట్టు
నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), మహ్మదుల్ హసన్ జాయ్, జాకీర్ హసన్, షాద్మాన్ ఇస్లాం, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ కుమార్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, నహిద్ రానా, హసన్ మహ్మద్, ఖలీద్ అహ్మద్, జాకర్ అలీ అనిక్
చదవండి: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఒకే జట్టులో విరాట్ కోహ్లి, బాబర్ ఆజం?
Comments
Please login to add a commentAdd a comment