
ముంబై: జూన్‌లో న్యూజిలాండ్‌తో జరగనున్న వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. దీంతో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు కూడా ఇదే జట్టును కొనసాగించనున్నారు. కోహ్లి కెప్టెన్‌గా.. అజింక్య రహానే వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. కాగా సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకు ఐదు రోజులపాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ జరగనుంది.
మొత్తం 18 మంది ప్రాబబుల్స్‌తో కూడిన జట్టులో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌లకు చోటు దక్కలేదు. ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన యువ ఓపెనర్ పృథ్వీ షాకు చోటు దక్కలేదు. పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయడానికి సిద్ధంగా లేకపోవడంతో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయలేదు. ఇక సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు నిరాశే ఎదురైంది. గాయం నుంచి కోలుకున్న తెలుగు ఆటగాడు హనుమ విహారి తిరిగి జట్టులోకి వచ్చాడు.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ముగిసిన తర్వాత టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 14 వరకు ఈ సిరీస్ జరగనుంది. కాగా రిషబ్ పంత్‌కు బ్యాకప్‌గా కేఎల్ రాహుల్, వృద్దిమాన్ సాహాల పేర్లు పరిశీలించనప్పటికి జట్టులో వారి పేర్లు ప్రకటించలేదు. వారిద్దరు తమ ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌ను క్లియర్ చేయాల్సి ఉందని బీసీసీఐ ట్విటర్‌లో తెలిపింది. బీసీసీఐ ప్రకటించిన భారత జట్టును ఒకసారి పరిశీలిద్దాం.
భారత్ జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైఎస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, పుజారా, విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, ఇషాంత్ శర్మ, షమీ, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్
చదవండి: టీ20 వరల్డ్‌కప్.. ఐసీసీ కీలక నిర్ణయం
India's squad: Virat Kohli (C), Ajinkya Rahane (VC), Rohit Sharma, Gill, Mayank, Cheteshwar Pujara, H. Vihari, Rishabh (WK), R. Ashwin, R. Jadeja, Axar Patel, Washington Sundar, Bumrah, Ishant, Shami, Siraj, Shardul, Umesh.
— BCCI (@BCCI) May 7, 2021
KL Rahul & Saha (WK) subject to fitness clearance.
Comments
Please login to add a commentAdd a comment