యాషెస్ సిరీస్ ఆశలను ఇంగ్లండ్ సజీవంగా నిలుపుకుంది. లీడ్స్ వేదికగా జరిగిన యాషెస్ మూడో టెస్టులో ఆస్ట్రేలియాపై 3 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. తద్వారా ఆస్ట్రేలియా అధిక్యాన్ని 2-1కు ఇంగ్లండ్ తగ్గించింది. ఇంగ్లండ్ విజయంలో ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్(75) కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్(32 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ఇక ఈ విజయంతో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్రపంచరికార్డు. టెస్టు క్రికెట్‌లో 250 ప్లస్ టార్గెట్‌ను అత్యధిక సార్లు ఛేజింగ్ చేసిన జట్టుకు కెప్టెన్‌గా స్టోక్స్ నిలిచాడు. ఇప్పటివరకు స్టోక్స్ సారధ్యంలో ఇంగ్లండ్ జట్టు ఐదు సార్లు 250 పైగా లక్ష్యాన్ని ఛేదించింది.
అంతకుముందు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది. ధోని సారధ్యంలో టీమిండియా నాలుగు సార్లు 250 పైగా టార్గెట్‌ను ఛేజ్ చేసింది. తాజా మ్యాచ్‌తో ధోని రికార్డును స్టోక్స్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాతి స్ధానంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఉన్నారు. వీరిద్దరూ మూడు సార్లు 250 పైగా పరుగులు ఛేజింగ్ చేసిన జట్లకు కెప్టెన్‌లగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment