టేక్ స్పోర్ట్స్-ఆలిండియా బుచ్చి బాబు టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. ఇవాళ (సెప్టెంబర్ 11) ముగిసిన ఫైనల్లో ఛత్తీస్‌ఘడ్‌పై 243 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 518 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఛత్తీస్‌ఘడ్ 274 పరుగులకు ఆలౌటైంది.
ఓపెనర్ ఆయుష్ పాండే(134 బంతుల్లో 117; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో పోరాడినా ఫలితం లేకుండా పోయింది. అతనికి తోడుగా మరో ఓపెనర్ శశాంక్ చంద్రకర్ (45 బంతుల్లో 50; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ ఐదు, అనికేత్ రెడ్డి రెండు, రోహిత్ రాయుడు, నితేష్ కన్నాల, తన్మయ్ అగర్వాల్ తలో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 417 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 281 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లు చెలరేగడంతో ఛత్తీస్‌ఘడ్ తొలి ఇన్నింగ్స్‌లో 181, రెండో ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. కాగా, గతేడాది ప్లేట్ గ్రూప్‌లో ఉండిన హైదరాబాద్.. తదుపరి సీజన్‌లో ఎలైట్ గ్రూప్‌లోకి అడుగుపెట్టనుంది.
చదవండి: బుచ్చిబాబు టోర్నీ ఫైనల్: పటిష్ట స్థితిలో హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment