టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-12లో గ్రూఫ్-2లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి మరోసారి చెలరేగాడు. పాకిస్తాన్‌పై ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ మరువకముందే టీమిండియా రన్‌మెషిన్ మరో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లి 44 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో 62 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు.
పాక్‌తో మ్యాచ్‌లో ఆఖరి వరకు నింపాదిగా ఆడిన కోహ్లి చివర్లో గేర్ మార్చి తన విశ్వరూపాన్ని చూపెట్టాడు. అయితే ఇవాళ నెదర్లాండ్స్‌తో ఆడిన మ్యాచ్‌లో కోహ్లి మరో యాంగిల్ చూపించాడు. ఒకపక్క సూర్యకుమార్ దంచికొడుతుంటే అతనికి సపోర్ట్ ఇస్తూనే తనదైన స్టైల్‌లో చెలరేగాడు. పాక్‌తో ఇన్నింగ్స్, ఇవాళ్టి నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ మధ్యలో అదొక్కటే తేడా.
మరో ఆసక్తికర విషయమేంటంటే.. టీమిండియాతో మ్యాచ్‌కు ముందు బుధవారం నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్‌వర్డ్స్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. ఆ ప్రెస్‌మీట్‌లో స్కాట్.. ''కోహ్లి మమ్మల్ని కరుణిస్తాడనుకుంటున్నా'' అంటూ ఫన్నీగా పేర్కొన్నాడు. కానీ కోహ్లి మాత్రం నెదర్లాండ్స్‌ను కరుణించలేదు. తాను ఫామ్‌లోకి వస్తే ఎలా ఉంటుందో డచ్ ఆటగాళ్లుకు రుచి చూపించాడు. ఈ విషయాన్ని గుర్తు చేస్తున్న అభిమానులు.. ''స్కాట్ ఎడ్‌వర్డ్స్.. కోహ్లి మిమ్మల్ని కరుణించలేదు.. హాఫ్ సెంచరీతో వదిలిపెట్టాడు.. సెంచరీ చేయలేదు సంతోపడండి.. ఫామ్‌లోకి వస్తే ఎవరిని పట్టించుకోడు.. తన ఆటను తాను ఆడుకుంటూ పోతాడు'' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
చదవండి: రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. తొలి భారత ఆటగాడిగా
Comments
Please login to add a commentAdd a comment