
శనివారం జరిగిన పురుషుల 81 కేజీల వెయిట్ కేటగిరీలో బరిలోకి దిగిన 37 ఏళ్ల చైనా లిఫ్టర్ లియూ జియోజున్ 374 కేజీల (స్నాచ్‌లో 170+ క్లీన్ అండ్ జెర్క్‌లో 204) బరువు ఎత్తి ఒలింపిక్ రికార్డుతో పాటు పసిడి పతకాన్ని సాధించాడు. తద్వారా ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణ పతకం నెగ్గిన అతిపెద్ద వయస్కుడిగా చరిత్రకెక్కాడు. విశ్వక్రీడల్లో లియూకిది మూడో పతకం. 2012లో పసిడి... 2016 రియోలో రజతం సాధించాడు.