CSK becomes First IPL team to have 10M followers on Twitter - Sakshi
Sakshi News home page

IPL: చరిత్ర సృష్టించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. తొలి ఐపీఎల్‌ జట్టుగా

Published Fri, Aug 18 2023 9:02 AM | Last Updated on Fri, Aug 18 2023 9:43 AM

CSK becomes First IPL team to have 10M followers on Twitter - Sakshi

చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరో అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకుంది. ఎక్స్‌(ట్విటర్‌)లో 10 మిలియన్ల ఫాలోవర్లను సాధించిన తొలి ఐపీఎల్‌ జట్టుగా సీఎస్‌కే నిలిచింది. ఈ విషయాన్ని చెన్నై ఫ్రాంచైజీ ఎక్స్‌ వేదికగా అభిమానులతో షేర్‌ చేసుకుంది. ఈ అరుదైన ఫీట్‌ సాధించిన జాబితాలో ముంబై ఇండియన్స్‌ 8.2 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్ధానంలో ఉంది.

ఆ తర్వాత ఆర్సీబీ(6.8) కేకేఆర్‌(5.2), ఎస్‌ఆర్‌హెచ్‌(3.2) మిలయన్ల ఫాలోవర్లతో వరుసగా మూడు, నాలుగు, ఐదు స్ధానాల్లో ఉన్నాయి. అదే విధంగా పంజాబ్‌ కింగ్స్‌(2.9), రాజస్తాన్‌ రాయల్స్‌(2.7), ఢిల్లీ క్యాపిటల్స్‌(2.5), లక్నో సూపర్‌ జెయింట్స్‌(760.4k),గుజరాత్‌ టైటాన్స్‌(552.7) ఫాలోవర్లను కలిగి ఉన్నాయి.

                                        

ఇక ఐపీఎల్‌-2023 విజేతగా ధోని సారథ్యంలోని చెన్నైసూపర్‌ కింగ్స్‌ నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో 17 పరుగుల తేడాతో విజయం సాధించిన సీఎస్‌కే.. ఐదో సారి ఐపీఎల్‌ టైటిల్‌ను ముద్దాడింది. ఈ విజయంతో అత్యధిక టైటిల్స్‌ను గెలిచిన ముంబై ఇండియన్స్‌ రికార్డను సీఎస్‌కే సమం చేసింది.
చదవండి: చాలా సంతోషంగా ఉంది.. ఎప్పుడూ అలా ఫీలవ్వలేదు! నా టార్గెట్‌ అదే: బుమ్రా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement