ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి (116 బంతుల్లో 85; 6 ఫోర్లు)తో పాటు చిరస్మరణీయ ఇన్నింగ్స్ (115 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించిన కేఎల్ రాహుల్, ఈ ప్రదర్శన కారణంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సిక్సర్ బాది జట్టును విజయతీరాలకు చేర్చిన రాహుల్, 3 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.
విన్నింగ్ షాట్ కొట్టిన అనంతరం రాహుల్ ముఖంలో సెంచరీ మిస్ చేసుకున్నానన్న బాధ స్పష్టంగా కనిపించింది. ఈ సందర్భంగా రాహుల్ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ రెండు అర్థాలను సూచించాయి. ఓ పక్క జట్టును గెలిపించానన్న ఆనందం, మరోపక్క సెంచరీ మిస్ అయ్యానన్న బాధ.
మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా సెంచరీ మిస్ కావడంపై రాహుల్ స్పందిస్తూ.. ముందుగా నేను సిక్సర్ బాగా కొట్టానని చెప్పాలి. వాస్తవానికి తన ప్రణాళికలో సెంచరీ ఉండింది. సెంచరీ ఎలా పూర్తి చేయాలో ప్లాన్ వేసుకున్నాను. బౌండరీ, సిక్సర్‌తో అది సాధ్యపడుతుందని అనుకున్నాను. అయితే అది కుదరలేదు. బౌండరీ కొట్టాక సిక్సర్ కోసం ట్రై చేద్దామనుకుంటే, మొదటిదే సిక్సర్‌గా వెళ్లింది.
ఆ షాట్ నేను చాలా బాగా ఆడాను. సెంచరీ మిస్ అయినందుకు పెద్దగా బాధ లేదు. మేము గెలిచాం. నెక్స్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేసేందుకు ప్రయత్నిస్తా అని అన్నాడు. సెంచరీ మిస్ అయినందుకు బాధ లేదని పైకి చెబుతున్నప్పటికీ, రాహుల్ ముఖంలో ఆ బాధ కొట్టొచ్చినట్లు కనపడింది. దీనికి సంబంధించిన వీడయో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
కాగా, నిన్న ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. బుమ్రా (10-0-35-2), రవీంద్ర జడేజా (10-2-28-3), కుల్దీప్ యాదవ్ (10-0-42-2), అశ్విన్ (10-1-34-1), సిరాజ్ (6.3-1-26-1), హార్దిక్ (3-0-28-1) ధాటికి 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం భారత్.. కోహ్లి, రాహుల్‌ల చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ల సాయంతో 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చారిత్రక విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్ 3, స్టార్క్ ఓ వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్, ఇషాన్‌లతో పాటు శ్రేయస్ అయ్యర్ డకౌట్లయ్యారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో (అక్టోబర్ 11) న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment