పాకిస్తాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా రీసౌండ్ విక్డరీ సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి ప్రపంచకప్‌లో పాక్‌కు వరుసగా ఎనిమిదోసారి ఓటమి రుచి చూపించింది. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. పాక్‌ను 191 పరుగులకే ఆలౌట్ చేసింది. భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించి పాక్‌ను కట్టడి చేశారు. ముఖ్యంగా బుమ్రా (7-1-19-2), కుల్దీప్ యాదవ్ (10-0-35-2), రవీంద్ర జడేజా (9.5-0-38-2) దాయాదిని ముప్పుతిప్పలు పెట్టారు. సిరాజ్ (8-0-50-2), హార్దిక్ (6-0-34-2) ఓ మోస్తరుగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ కీలకమైన వికెట్లు తీశారు.
అనంతరం స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన భారత్.. రోహిత్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో (63 బంతుల్లో 86; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. హిట్‌మ్యాన్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ (53 నాటౌట్) కూడా రాణించాడు. 30.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకున్న భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ప్రస్తుత ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ విక్టరీ సాధించింది. అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి కీలకమైన మొహమ్మద్ రిజ్వాన్, షాదాబ్ ఖాన్ వికెట్లు సాధించిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
కేఎల్ రాహుల్‌కు స్పెషల్ అవార్డు..
ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఫీల్డ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే భారత ఆటగాళ్లకు జట్టు ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ బెస్ట్ ఫీల్డర్ అవార్డుతో పాటు మెడల్‌ను బహుకరిస్తున్న విషయం తెలిసిందే. ఆసీస్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఈ అవార్డును విరాట్ కోహ్లి దక్కించుకోగా.. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అవార్డు శార్దూల్ ఠాకూర్‌ను వరించింది.
నిన్న పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇమామ్ ఉల్ హాక్ క్యాచ్‌ను అద్భుతంగా అందుకోవడంతో పాటు వికెట్ల వెనక చాకచక్యంగా వ్యవహరించినందుకు గాను బెస్ట్ ఫీల్డర్ అవార్డుకు కేఎల్ రాహుల్ ఎంపికయ్యాడు. గత మ్యాచ్ విన్నర్ శార్దూల్ ఠాకూర్ ఈ అవార్డును రాహుల్‌కు అందించాడు. శార్దూల్.. రాహుల్ మెడలో మెడల్ వేసి సత్కరించాడు. ఈ అవార్డు ప్రధానోత్సవానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్‌మీడియాలో షేర్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment