పాకిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్ 14) జరిగే హైఓల్టేజీ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు తుది జట్టులో ఛాన్స్ దొరకే అవకాశం లేదని తెలుస్తుంది. మ్యాచ్‌కు వేదిక అయిన నరేంద్ర మోదీ స్టేడియం పేసర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉండటంతో టీమిండియా మేనేజ్‌మెంట్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. పాక్ బ్యాటర్లకు అశ్విన్ బౌలింగ్‌పై అంచనా ఉండటం కూడా అతడిని తప్పించడానికి ఓ కారణమై ఉంటుందని తెలుస్తుంది. ఒకవేళ అశ్విన్‌ను తప్పిస్తే అదనపు పేసర్‌గా మొహమ్మద్ షమీ జట్టులోకి వస్తాడని సమాచారం.
ముగ్గురు పేసర్లతో..
పాక్‌తో మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతుందని వార్తలు వస్తున్నాయి. బుమ్రా, సిరాజ్, షమీలతో పాటు టీమిండియా అమ్ములపొదిలో పార్ట్‌టైమ్ పేసర్ హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు. నలుగురు పేసర్లతో భారత పేస్ విభాగం పటిష్టంగా ఉంటుంది. పిచ్ నుంచి పేసర్లకు సహకారం లభిస్తే, ఈ రోజు వారు చెలరేగడం ఖాయం. పేస్‌తో పాటు భారత స్పిన్ విభాగం కూడా బలంగా ఉంది. ముగ్గురు పేసర్లతో వెళితే అశ్విన్‌ను ఆడించే అవకాశం లేనప్పటికీ ఫామ్‌లో ఉన్న కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా అద్భుతాలు చేయగల సమర్థులు.
గిల్ ఎంట్రీ..
డెంగ్యూ కారణంగా వరల్డ్‌కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న శుభ్‌మన్ గిల్ పాక్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమైపోయింది. ఈ విషయంపై రోహిత్ శర్మ ఇదివరకే ఓ క్లూ కూడా ఇచ్చాడు. గిల్ పూర్తిగా కోలుకున్నాడని హిట్‌మ్యాన్ నిన్ననే చెప్పాడు. గిల్ జట్టులోకి రీఎంట్రీ ఇస్తే ఇషాన్ కిషన్‌పై వేటు పడుతుంది.
భారత తుది జట్టు (అంచనా): శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment