IND VS PAK: ట్రై కలర్‌ జెర్సీ బదులు వేరే జెర్సీతో బరిలోకి దిగిన కోహ్లి | India Vs Pakistan ICC World Cup 2023: Virat Kohli Forgets To Wear Tricolour Stripes Jersey - Sakshi
Sakshi News home page

CWC 2023 IND VS PAK: ట్రై కలర్‌ జెర్సీ బదులు వేరే జెర్సీతో బరిలోకి దిగిన కోహ్లి

Published Sat, Oct 14 2023 3:37 PM | Last Updated on Sat, Oct 14 2023 3:48 PM

CWC 2023 IND VS PAK: Virat Kohli Forgets To Wear Tricolour Stripes Jersey - Sakshi

పాకిస్తాన్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి ఓ పొరపాటు చేశాడు. భారత అఫీషియల్‌ జెర్సీకి బదులు వేరే జెర్సీతో బరిలోకి దిగాడు. భుజాలపై మూడు రంగుల అడ్డగీతలు కలిగిన జెర్సీని కాకుండా వైట్‌ స్ట్రైప్స్‌ కలిగిన జెర్సీని ధరించి స్టేడియంలోకి ఎంటరయ్యాడు. అదే జెర్సీతో నేషనల్‌ ఆంథమ్‌కు అటెండ్‌ అయ్యాడు. మ్యాచ్‌ ప్రారంభమయ్యాక కూడా కాసేపు అదే జెర్సీతో కొనసాగాడు.

ఆ తర్వాత ఎవరో నోటీస్‌ చేస్తే వెంటనే డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లి అఫీషియల్‌ జెర్సీ వేసుకొచ్చాడు. విషయం తెలిసి అభిమానులు కోహ్లిపై సెటైర్లు వేస్తున్నారు. రోహిత్‌ శర్మకు కాదు నీకే  మతిమరుపు అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే, నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న పాక్‌ 18 ఓవర్లలో 2 వికెట్ల  నష్టానికి 96 పరుగులు చేసింది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్‌ (20), ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (36) ఔట్‌ కాగా.. మొహమ్మద్‌ రిజ్వాన్‌ (14), బాబర్‌ ఆజమ్‌ (25) క్రీజ్‌లో ఉన్నారు. సిరాజ్‌, హార్దిక్‌ పాండ్యాకు తలో వికెట్‌ దక్కింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement