బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌లో దబంగ్ ఢిల్లీ జట్టు గెలుపు బోణీ చేసింది. బెంగళూరు బుల్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 38–31తో విజయం సాధించింది. ఢిల్లీ తరఫున నవీన్ అత్యధికంగా 13 పాయింట్లు స్కోరు చేయగా... అశు మలిక్ తొమ్మిది పాయింట్లు సాధించాడు.
బెంగళూరు తరఫున భరత్ 12 పాయింట్లు సంపాదించాడు. మరో మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 43–32తో యు ముంబాను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్‌తో హరియాణా స్టీలర్స్; యూపీ యోధాస్‌తో తెలుగు టైటాన్స్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment