రోహిత్ శర్మ సారధ్యంలోని భారత జట్టు వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కుఅన్ని విధాల సిద్దమవుతోంది. ఇప్పటికే భారత గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా జూలై 3నుంచి తమ ప్రాక్టీస్‌ను కూడా మొదలుపెట్టింది. ఈ పర్యటనలో భాగంగా అతిథ్య విండీస్‌తో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.
జూలై 12 నుంచి డొమినికా వేదికగా జరగనున్న తొలి టెస్టుతో టీమిండియా టూర్ ప్రారంభం కానుంది. ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జూలై రెండో వారంలో టీ20 జట్టును కూడా బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది.
ఇక ఇది ఇలా ఉండగా.. భారత్-విండీస్ మ్యాచ్‌లు కేబుల్ ఛానెల్‌లలో ప్రసారం చేయబడవు. కేబుల్ ఛానెల్స్‌కు బదులుగా డీడీ స్పోర్ట్స్ ఛానెల్ ఉచితంగా లైవ్ టెలికాస్ట్ చేయనుంది. డీడీ స్పోర్ట్స్‌తో పాటు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ జియో సినిమా, ఫ్యాన్ కోడ్ కూడా ఈ మ్యాచ్‌లను ప్రచారం చేయనున్నాయి.
వెస్టిండీస్‌తో టెస్టు 'సిరీస్‌కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ.
వెస్టిండీస్ సన్నాహక జట్టు:
క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), అలిక్ అథనేజ్, జెర్మైన్ బ్లాక్వుడ్, ఎన్క్రుమా బోనర్, తగెనరైన్ చంద్రపాల్, రఖీమ్ కార్న్వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, కవెమ్ హాడ్జ్, అకీమ్ జోర్డాన్, జైర్ మెక్అలిస్టర్, కిర్క్ మెకెంజీ, మార్క్వినో మైండ్లీ, అండర్సన్ ఫిలిప్, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికన్.
చదవండి: Ashes Series 2023: గెలుపు జోష్‌లో ఉన్న ఆసీస్‌కు భారీ షాక్.. ఇకపై కష్టమే..!
Comments
Please login to add a commentAdd a comment