రెండోసారి తండ్రైన క్రికెటర్‌ | Faf du Plessis And Wife Imari Visser Welcomes Baby Girl | Sakshi
Sakshi News home page

రెండోసారి తండ్రైన డు ప్లెసిస్‌

Published Thu, Aug 20 2020 9:05 PM | Last Updated on Thu, Aug 20 2020 9:13 PM

Faf du Plessis And Wife Imari Visser Welcomes Baby Girl - Sakshi

కేప్‌టౌన్‌‌: దక్షిణాఫ్రికా క్రికెటర్‌ ఫాఫ్‌ డు ప్లెసిస్‌ అభిమానులతో శుభవార్త పంచుకున్నాడు. తన భార్య ఇమరి వెస్సెర్‌ గురువారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. చిన్నారికి జో డూ ప్లెసిస్‌ అని నామకరణం చేసినట్లు తెలిపాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో భార్యతో ఉన్న ఫొటో షేర్‌ చేసిన ఈ మాజీ కెప్టెన్‌..‘‘ఈ అద్భుతమైన ప్రపంచంలోకి నీకు స్వాగతం జో. నిన్ను మేమెంతగానో ప్రేమిస్తున్నాం. నీకు రక్షణగా నిలిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను. లవ్‌ యూ’’ అంటూ భావోద్వేగ సందేశాన్ని జతచేశాడు.(ధోని దమ్మున్న సారథి: డు ప్లెసిస్‌)

దీంతో డు ప్లెసిస్‌, ఇమరి దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా డు ప్లెసిస్‌ తన చిరకాల ప్రేయసి ఇమరి వెస్సెర్‌ను 2013లో పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు 2017లో తొలి సంతానంగా కుమార్తె ఎమిలీ జన్మించింది. ఇక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న డు ప్లెసిస్‌ చిన్నారి రాక నేపథ్యంలో ప్రస్తుతం కుటుంబానికి సమయం కేటాయించాడు. ఈ నేపథ్యంలో దుబాయ్‌ వేదికగా జరుగనున్న ఐపీఎల్‌ ఈవెంట్‌లో కాస్త ఆలస్యంగా జట్టుతో చేరనున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement