
గుజరాత్ టైటాన్స్ యువ వికెట్‌కీపర్, ఐపీఎల్ 2024 వేలంలో ఊహించని ధర దక్కించుకున్న ఝార్ఖండ్ ఆటగాడు రాబిన్ మింజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. శనివారం రాంచీలో బైక్‌పై వెళ్తుండగా రాబిన్ ప్రయాణిస్తున్న కవాసకీ సూపర్‌బైక్ అదుపు తప్పి వేగంగా వెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో రాబిన్ టూ వీలర్ నుజ్జుగుజ్జయ్యింది. స్వల్ప గాయాలతో రాబిన్ బయటపడ్డాడు.
ప్రమాదంలో రాబిన్‌కు పెద్ద దెబ్బలు ఏవీ తగల్లేదని అతని తండ్రి ఫ్రాన్సిస్ మింజ్ ధృవీకరించాడు. ప్రస్తుతం రాబిన్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు ఆయన తెలిపాడు. 21 ఏళ్ల రాబిన్‌ను 2024 ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్స్ 3.6 కోట్లకు సొంతం చేసుకుంది. రాబిన్ తండ్రి ఫ్రాన్సిస్ మింజ్ రాంచీ ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తాడు. కొద్ది రోజుల కిందటే అతను.. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను కలిసాడు. ఈ సందర్భంగా దిగిన ఫోటో నెట్టింట వైరలైంది.
రాబిన్ ఇటీవల కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో భాగంగా కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో క్వార్టర్ ఫైనల్లో సెంచరీతో (137) మెరిశాడు. ఆ మ్యాచ్‌లో రాబిన్ శతక్కొట్టినా అతను ప్రాతినిథ్యం వహించిన ఝార్ఖండ్ టీమ్ ఓటమిపాలైంది. ఎడమ చేతి వాటం బ్యాటింగ్ వికెట్‌కీపర్ అయిన రాబిన్.. ఆదివాసీ తెగకు చెందిన ఆటగాడు. ఈ బ్యాక్ గ్రౌండ్ నుంచి పై స్థాయి క్రికెట్ ఆడే అవకాశం రావడం అంటే ఆషామాషీ విషయం కాదు. రాబిన్ మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ ప్రీ సీజన్ క్యాంప్‌లో జాయిన్ కావాల్సి ఉండింది,. అయితే ఈ ప్రమాదం కారణంగా అతను కాస్త ఆలస్యంగా జట్టుతో చేరతాడు.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 ఎడిషన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు సంబంధించిన తొలి షెడ్యూల్ కొన్ని రోజుల కిందటే విడుదలైంది. తొలి విడతగా 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు నిర్వహకులు. గుజరాత్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 24వ తేదీన ఆడనుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గుజరాత్.. ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment