ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు యువ వికెట్ కీపర్ రాబిన్ మింజ్ ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా శనివారం ధ్రువీకరించాడు. జార్ఖండ్‌కు చెందిన రాబిన్ మింజ్ ఇటీవల బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. మింజ్ ప్రస్తుతం కోలుకునే క్రమంలో ఉన్నాడు.
అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి 4 నుంచి 6 వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు ఐపీఎల్ 17వ సీజన్ మొత్తానికి మింజ్ దూరమయ్యాడు. కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో రాబిన్ మింజ్‌ను రూ. 3.60 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.
ఐపీఎల్‌లో వేలంలో అమ్ముడు పోయిన మొట్ట మొదటి ఆదివాసీ క్రికెటర్‌గా నిలిచాడు. కానీ దురదృష్టం మాత్రం అతడిని రోడ్డు ప్రమాదం రూపంలో వెంటాడింది. తన తొలి సీజన్‌లో సత్తాచాటాలని భావించిన మింజ్.. ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment