
భారత జట్టు(PC: BBCI)
నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో టీ20కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా తొలి టీ20కు దూరమైన భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో అతడు కీలకమైన రెండో టీ20కు తుది జట్టులోకి రానున్నాడు. ఈ విషయాన్ని భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ధృవీకరించాడు.
గురువారం ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సూర్య మాట్లాడుతూ.. "జస్ప్రీత్ బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. నెట్స్‌లో బుమ్రా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతడు నాగ్‌పూర్ మ్యాచ్‌కు జట్టులోకి రానున్నాడు. ప్రస్తుతం జట్టులో అందరూ ఫిట్‌గా ఉన్నారని" పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌కు ఉమేశ్ యాదవ్ స్థానంలో బుమ్రా తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇక మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆసీస్ చేతిలో భారత్ 4వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ సాధించినప్పటికీ.. ఫీల్డింగ్, బౌలింగ్‌లో విఫలకావడంతో ఓటమి మూటకట్టుకుంది. దీంతో రెండో టీ20లో ఏలగైనా విజయం సాధించి సిరీస్ సమం చేయాలని భారత్ భావిస్తోంది.
చదవండి: Ind vs Aus: అజారుద్దీన్ రివర్స్ అటాక్.. మ్యాచ్ నిర్వహించడం అంత ఈజీ కాదు..
Comments
Please login to add a commentAdd a comment