
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా.. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో పోరుకు సిద్దమైంది. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. డిసెంబర్ 4న ఢాకా వేదికగా జరగనున్న తొలి వన్డేతో టీమిండియా టూర్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రోహిత్ సారథ్యంలోని భారత జట్టు గురువారం బంగ్లాదేశ్ గడ్డపై అడుగుపెట్టింది. బంగ్లాదేశ్‌కు చేరుకున్న భారత ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది.
ఇక న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా ఉన్న శిఖర్ ధావన్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చహర్ శుక్రవారం భారత జట్టులో చేరనున్నారు. కాగా శుక్రవారం ఢాకా వేదికగా భారత జట్టు తమ తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గోనుంది. కాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన భారత సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తిరిగి బంగ్లాతో సిరీస్‌కు జట్టులో చేరారు.
Little Kids welcoming Rohit Sharma and Virat Kohli in Bangladesh - Beautiful pictures. pic.twitter.com/yLMFCZ69id
— CricketMAN2 (@ImTanujSingh) December 1, 2022
బంగ్లాదేశ్ వన్డేలకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్ , వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మొహమ్మద్. సిరాజ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్.
బంగ్లాదేశ్ టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ ,మహ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్.
చదవండి: BCCI Chief Selector:టీమిండియా చీఫ్ సెలక్టర్ రేసులో మాజీ స్పీడ్ స్టర్..!