చెన్నై: టీమిండియాతో చెపాక్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 178 పరుగుల వద్ద ఆలౌటైంది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకు విలవిల్లాడిన ఇంగ్లండ్ వరుసగా వికెట్లను కోల్పోయింది. అశ్విన్ ఆరు వికెట్లతో చెలరేగిపోయాడు. వరుస విరామాల్లో వికెట్లు తీసి ఇంగ్లండ్ రెండొందల పరుగుల మార్కు చేరకుండా కట్టడి చేశాడు. అయినప్పటికీ ఇంగ్లండ్ 419 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. బర్న్స్, సిబ్లే, స్టోక్స్, డొమినిక్ బెస్, జోఫ్రా ఆర‍్చర్, అండర్సన్ వికెట్లను అశ్విన్ సాధించాడు. ఇక నదీమ్‌కు రెండు వికెట్లు లభించగా, ఇషాంత్, బుమ్రాలకు తలో వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 578 పరుగులు చేయగా, టీమిండియా 337 పరుగులకు ఆలౌటైంది.
హైలెట్స్:
► తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న కెప్టెన్ జో రూట్ 40 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో రూట్ చేసిన పరుగులే అత్యధిక స్కోరుగా నిలిచింది. ఆ తర్వాత ఓలీ పాప్(28), బెస్(25), బట్లర్(24)లు అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాళ్లు.
►అశ్విన్ బౌలింగ్‌లో ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అవుట్ అయ్యాడు. పంత్‌కు క్యాచ్ ఇచ్చి వికెట్ సమర్పించుకున్నాడు. ఇక అంతకు ముందు ఇషాంత్ లారెన్స్‌ను పెవిలియన్‌కు పంపగా, ఓపెనర్లు బర్న్స్, సిబ్లీ వికెట్లను అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు.
►వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన డానియల్ లారెన్స్‌ను ఇషాంత్ శర్మ పెవిలియన్‌కు పంపాడు. 18 పరుగులు చేసి లారెన్స్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక లారెన్స్‌ను ఔట్ చేయడం ద్వారా, టెస్టుల్లో 300 వికెట్లు పూర్తి చేసుకున్న ఇషాంత్ శర్మ.. ఈ ఘనత సాధించిన భారత మూడో పేసర్‌గా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న ఇంగ్లండ్ ఆతిథ్య జట్టు కంటే ప్రస్తుతం 305 పరుగుల ఆధిక్యంలో ఉంది.
►ఆతిథ్య జట్టు కంటే 282 పరుగుల ఆధిక్యంలో జో రూట్ సేన.. రెండో ఇన్నింగ్స్‌లో రెండో వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ సిబ్లీ అవుట్ అయ్యాడు. అశ్విన్ బౌలింగ్‌లో, పుజారాకు క్యాచ్ ఇచ్చి 16 పరుగులు చేసి వెనుదిరిగాడు. కెప్టెన్ జో రూట్, లారెన్స్ బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.బంతికే ఇంగ్లండ్ మొదటి వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ డకౌట్‌గా వెనుదిరిగాడు. రహానేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. .
►ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆలౌట్ అయ్యింది. నాలుగో రోజు ఆటలో భాగంగా 95.5 ఓవర్లలో 337 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. వాషింగ్టన్ సుందర్ 85 పరుగులతో అజేయంగా నిలిచాడు.138 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో మెరుగైన స్కోరు సాధించాడు. ఇక పర్యాటక జట్టు 578 పరుగులతో తొలి ఇన్నింగ్స్‌ను ముగించగా.. టీమిండియా ఇంకా 241 పరుగులు వెనుకబడి ఉంది.
►ఆండర్సన్ బౌలింగ్‌లో ఇషాంత్ శర్మ(4) తొమ్మిద్ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. వాషింగ్టన్ సుందర్ (84), బుమ్రా క్రీజులో ఉన్నారు. భారత ప్రస్తుత స్కోరు 336/9. ఇక పర్యాటక జట్టు 578 పరుగులతో తొలి ఇన్నింగ్స్‌ను ముగించగా.. టీమిండియా ఇంకా 242 పరుగులు వెనుకబడి ఉంది.
►జాక్ లీచ్ బౌలింగ్‌లో నదీం డక్ అవుట్ అయ్యాడు. స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది.కాగా జాక్ లీచ్‌కు ఈ మ్యాచ్‌లో ఇది రెండో వికెట్. అంతకు ముందు అశ్విన్ వికెట్ కూల్చాడు. టీమిండియా తాజా స్కోరు 318/8. వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.
►అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వాషింగ్టన్ సుందర్‌కు తోడుగా మరో ఎండ్‌లో సహకారం అందిస్తున్న అశ్విన్(31).. జాక్ లీచ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 305 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది.
►నాలుగో రోజు ఆటలో భాగంగా, బ్యాటింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 111 బంతుల్లో 59 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఫార్వర్డ్, కవర్ డ్రైవ్ షాట్లతో అలరిస్తూ 10 ఫోర్ల సాయంతో సొంత గడ్డపై తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
►మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 257 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇక పర్యాటక జట్టు 578 పరుగులతో తొలి ఇన్నింగ్స్‌ను ముగించగా.. భారత్, 271 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం టీమిండియా స్కోరు 307/7. వశీ, నదీం క్రీజులో ఉన్నారు.
►భారత గడ్డపై వాషింగ్టన్ సుందర్ తొలి హాఫ్ సెంచరీ.
చదవండి: చెన్నై టెస్టులో భారత్ ఎదురీత
Comments
Please login to add a commentAdd a comment