పారిస్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత పొందడమే లక్ష్యంగా నేటి నుంచి బెల్‌గ్రేడ్‌లో మొదలుకానున్న ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు బరిలోకి దిగనున్నారు. ఈనెల 24 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో మొత్తం 30 వెయిట్ కేటగిరీల్లో (పురుషుల ఫ్రీస్టయిల్ 10, గ్రీకో రోమన్ 10, మహిళల ఫ్రీస్టయిల్ 10) పోటీలు నిర్వహించనుండగా... ఇందులో 18 ఒలింపిక్ వెయిట్ కేటగిరీలు... 12 నాన్ ఒలింపిక్ కేటగిరీలు ఉన్నాయి.
ఒలింపిక్ వెయిట్ కేటగిరీల్లో టాప్–5లో నిలిచిన రెజ్లర్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. భారత్ నుంచి మహిళల ఫ్రీస్టయిల్ 50 కేజీల విభాగంలో జూనియర్ ప్రపంచ చాంపియన్ అంతిమ్ పంఘాల్‌పైనే ఆశలు ఉన్నాయి. అంతర్గత వివాదాల కారణంగా భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)పై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు తటస్థ క్రీడాకారులుగా పోటీపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment