ఆసీస్‌తో మూడో వన్డే.. టీమిండియా బౌలర్‌ అరుదైన ఘనత | INDW VS AUSW 3rd ODI: Deepti Sharma Becomes The Fourth Indian Bowler To Pick 100 ODI Wickets In Womens Cricket | Sakshi
Sakshi News home page

ఆసీస్‌తో మూడో వన్డే.. టీమిండియా బౌలర్‌ అరుదైన ఘనత

Published Tue, Jan 2 2024 6:28 PM | Last Updated on Tue, Jan 2 2024 6:41 PM

INDW VS AUSW 3rd ODI: Deepti Sharma Becomes The Fourth Indian Bowler To Pick 100 ODI Wickets In Womens Cricket - Sakshi

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో ఇవాళ (జనవరి 2) జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా బౌలర్‌ దీప్తి శర్మ అరుదైన ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో కీలకమైన లిచ్‌ఫీల్డ్‌ వికెట్‌ తీసిన దీప్తి.. మహిళల వన్డేల్లో 100 వికెట్లు (86వ మ్యాచ్‌లో) తీసిన నాలుగో భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కింది. గతంలో జులన్‌ గోస్వామి (255 వికెట్లు), నీతూ డేవిడ్‌ (97 ​మ్యాచ్‌ల్లో 141 వికెట్లు), అల్‌ ఖదిర్‌ (78 మ్యాచ్‌ల్లో 100) భారత్‌ తరఫున వన్డేల్లో 100 వికెట్ల మార్కును తాకారు.

ఓవరాల్‌గా వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ రికార్డు టీమిండియా మాజీ పేసర్‌ జులన్‌ గోస్వామి పేరిట ఉంది. గోస్వామి 204 వన్డేల్లో 255 వికెట్లు తీసి ఈ విభాగంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. వన్డే క్రికెట్‌లో 200కుపైగా వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌ కూడా గోస్వామినే కావడం విశేషం.  

ఇదిలా ఉంటే, నామమాత్రంగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో (ఆసీస్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌ ఇదివరకే కైవసం చేసుకుంది) టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. ఓపెనర్‌ ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ (119) సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టాని​కి 338 పరుగులు చేసింది.

లిచ్‌ఫీల్డ్‌కు మరో ఓపెనర్‌ అలైసా హీలీ (82) కూడా తోడవ్వడంతో ఆసీస్‌ భారీ స్కోర్‌ చేసింది. ఆఖర్లో ఆష్లే గార్డ్‌నర్‌ (30), అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ (23), అలానా కింగ్‌ (26 నాటౌట్‌), జార్జియా వేర్హమ్‌ (11 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు.

భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్‌ 3 వికెట్లతో రాణించగా.. అమన్‌జోత్‌ కౌర్‌ 2, పూజా వస్త్రాకర్‌, దీప్తి శర్మ తలో వికెట్‌ వికెట్‌ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 9 ఓవర్లలో 43 పరుగులు మాత్రమే చేసి ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. యస్తికా భాటియా 6, స్మృతి మంధన 29 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ రెండు వికెట్లు మెగాన్‌ షట్‌కే దక్కాయి. హర్మన్‌ప్రీతికౌర్‌, రిచా ఘోష్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement