చెన్నై: ఆసీస్‌తో గతేడాది జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో గిల్ 91 పరుగుల క్లాస్ ఇన్సింగ్స్ టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించింది. పంత్ దూకుడు ముందు గిల్ ఇన్నింగ్స్ కాస్త తక్కువ అనిపించినా.. అతని ఇన్నింగ్స్‌ను తీసిపారేయలేం. ఆసీస్ గడ్డపై చూపించిన జోరును ఇంగ్లండ్‌తో సిరీస్‌లో గిల్ చూపించలేకపోయాడు. ఈ విషయాన్ని కాసేపు పక్కనపెడితే.. ఐపీఎల్‌లో శుబ్‌మాన్ గిల్ కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి గిల్ కేకేఆర్ తరపున స్థిరమైన ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు.
గతేడాది సీజన్‌లో కేకేఆర్ తరపున 14 మ్యాచ్‌లాడిన గిల్ 440 పరుగులు చేశాడు. అంతేగాక వరుస మూడు సీజన్లలో కేకేఆర్ తరపున 200 పరుగులకు పైగా సాధించిన గిల్ ఆ జట్టుకు ప్రధాన బ్యాట్స్‌మన్‌గా మారాడు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో గిల్‌పై కొందరు విమర్శలు చేశారు. ''వరుసగా టెస్టు మ్యాచ్‌లు ఆడావు.. ఐపీఎల్‌కు టెస్టు మ్యాచ్ అనుభవం ఏం పనికొస్తుంది.. టెస్టు మ్యాచ్ అంటేనే టక్ టక్ అనే శబ్ధం తప్ప భారీ షాట్లు ఆడేందుకు వీలుండదు. మరి అలాంటిది ఈసారి ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించగలడా'' అంటూ ప్రశ్నించారు.
దీనికి కేకేఆర్ అదిరిపోయే రీతిలో సమాధానమిచ్చింది. ఇప్పటికే కేకేఆర్ జట్టుతో కలిసిన గిల్ ప్రాక్టీస్ ఆరంభించాడు. ఈ సందర్భంగా గిల్ ఒక ఫర్‌పెక్ట్ షాట్ ఆడిన తరహాలో ఒక ఫోటోను కేకేఆర్ షేర్ చేసింది. ఆ ఫోటోలో గిల్ స్టన్నింగ్ షాట్ ఆడినట్లుగా కనిపిస్తుంది. హై ఎల్బో.. స్ట్రెయిట్ డ్రైవ్.. ఫోటో పర్‌ఫెక్ట్‌గా వచ్చింది.. గిల్ కరెక్ట్‌గానే ఉన్నాడు.. మీరు చెప్పాల్సిన పని లేదు.. అంటూ కామెంట్ చేసింది. కాగా ఈ సీజన్‌లో కేకేఆర్ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 11న చెన్నై వేదికగా సన్‌రైజర్స్‌తో తలపడనుంది.
చదవండి: జెర్సీలో కలర్‌ఫుల్‌గా ఉన్నావు.. మరి టైటిల్ సంగతేంటి!
ఆ జెర్సీ వేసుకోలేను.. ఓకే చెప్పిన సీఎస్‌కే
Comments
Please login to add a commentAdd a comment