ఆర్సీబీ ఆటగాడు ఏబీ డివిలియర్స్(ఫొటో కర్టెసీ: ఐపీఎల్/బీసీసీఐ), యువీ
చెన్నై: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్- 2021 ఓపెనింగ్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలుపుతో బోణీ కొట్టడంతో అభిమానులు ఆనందంలో ఉన్నారు. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం జరిగిన ఉత్కంఠ పోరులో 2 వికెట్ల తేడాతో విజయం సాధించడం పట్ల ఖుషీ అవుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ అద్భుత బౌలింగ్‌కు తోడు కెప్టెన్ విరాట్ కోహ్లి(33), గ్లెన్ మ్యాక్స్‌వెల్(39), ఏబీ డివిలియర్స్(48) రాణించడంతో ముంబైపై పైచేయి సాధించగలిగింది.
ఈ మ్యాచ్ ఫలితంపై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్, ఆర్సీబీ స్టార్ ఆటగాడు డివిలియర్స్‌ను ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘‘ఏబీ డివిలియర్స్‌ను ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు ఎందుకు పంపించారో అర్థం కావడం లేదు. టీ20 మ్యాచ్‌లో మీ జట్టులోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ నంబర్ 3 లేదా నంబర్ 4 స్థానంలో వస్తాడనుకున్నా. అయితే ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే’’అని ట్వీట్ చేశాడు.
కాగా ఇదే విషయం గురించి కోహ్లి మాట్లాడుతూ.. ‘‘ఏబీ వంటి విలక్షణ ఆటగాడు నెమ్మదైన పిచ్‌లపై ఎలా ఆడగలడో తెలుసు. ఒకవేళ మెరుగైన భాగస్వామ్యాలు నమోదు చేయాలనుకున్నపుడు కొన్నిసార్లు ప్రయోగాలు తప్పవు. ఛేజింగ్‌లో భాగంగా విలువైన వికెట్లను అట్టిపెట్టుకునే క్రమంలో ఏబీడీ ఐదో స్థానంలో వచ్చాడు. తను అవుట్ అయ్యేంత వరకు మ్యాచ్ ముగిసిపోదని ప్రత్యర్థి జట్టుకు కూడా ఓ అంచనా ఉంటుంది కదా. ఏబీడీ లోయర్ డౌన్ ఆర్డర్‌లో రావడం వల్ల వారిలో నర్వస్‌నెస్ క్రియేట్ చేయాలనుకున్నాం’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఏప్రిల్ 14 ఆర్సీబీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నైలో తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది.
చదవండి: రనౌట్: ఏమో.. ఇదే నాకు చివరి మ్యాచ్ కావొచ్చు!
మాక్సీ మెరుపులు: గట్టిగా హగ్ ఇచ్చేవాళ్లం.. కౌంటర్ పడిందిగా!
సీజన్ మొత్తం తననే కొనసాగించాలనుకుంటున్నాం: కోహ్లి
Don’t understand @ABdeVilliers17 batting at no 5 !!? 🤷♂️your best batsmen after opening have to come at no 3 or no 4 in t20 just an opinion #MIvRCB #IPL2021
— Yuvraj Singh (@YUVSTRONG12) April 9, 2021
Comments
Please login to add a commentAdd a comment