Watch: IPL 2022 DC Vs RR April 23rd Match Highlights Trending Viral Videos - Sakshi
Sakshi News home page

IPL Trending: రాజస్తాన్‌ సంబరాలు.. కేక్‌ కట్‌చేసిన సంజూ.. పాపం పంత్‌!

Published Sat, Apr 23 2022 12:49 PM | Last Updated on Sat, Apr 23 2022 1:31 PM

IPL 2022 DC Vs RR: April 23rd Trending Viral Videos Sanju Samson Comments - Sakshi

PC: IPL/BCCI

రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ చిరస్థాయిగా నిలిచిపోనుంది. ఐపీఎల్‌లో సంజూకు ఇది వందో మ్యాచ్‌. ఇలా ఢిల్లీతో మ్యాచ్‌తో సెంచరీ మార్కు అందుకోవడమే కాకుండా.. రాజస్తాన్‌ విజయంలో కీలకంగా పాత్ర పోషించి బ్యాటర్‌గా, కెప్టెన్‌గా దీనిని మరింత ప్రత్యేకం చేసుకున్నాడు.

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం ఆర్‌ఆర్‌ డ్రెస్సింగ్‌ రూంలో సంబరాలు అంబరాన్నంటాయి. సంజూతో కేక్‌ కట్‌ చేయించి సహచర ఆటగాళ్లు అతడికి అభినందనలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది.

దీనితో పాటు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న మరికొన్ని వీడియోలపై ఓ లుక్కేద్దాం.
అదీ మరి సంజూ అంటే!
ఈ మ్యాచ్‌లో హెట్‌మెయిర్‌ కంటే ముందు శాంసన్‌ ముందు బ్యాటింగ్‌ వెళ్లిన విషయంపై డ్రెస్సింగ్‌ రూంలో చర్చించిన మేనేజ్‌మెంట్‌ తమ కెప్టెన్‌పై ప్రశంసలు కురిపించింది. 19 బంతుల్లో 46 పరుగులు చేయడం అద్భుతమంటూ కొనియాడింది.


సహనం కోల్పోయిన పంత్‌.. నో బాల్‌ వివాదంపై నెట్టింట చర్చ..  ఆఖరి ఓవర్‌లో మెక్‌కాయ్‌ వేసిన మూడో బంతిపై చెలరేగిన వివాదం. తమ బ్యాటర్లను వెనక్కి పిలిచిన ఢిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌. దీంతో మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

ఈ విషయంపై మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన సంజూ... ‘‘అది ఫుల్‌టాస్‌ బాల్‌. సిక్సర్‌ వెళ్లింది. నో బాల్‌ ఇవ్వాలని బ్యాటర్లు కోరుకున్నారు. కానీ అంపైర్‌ నాటౌట్‌ నిర్ణయానికి కట్టుబట్టాడు’’ అని వ్యాఖ్యానించాడు.

15 పరుగుల తేడాతో ఢిల్లీపై రాజస్తాన్‌ విజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి సంజూ బృందం

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ జోస్‌ బట్లర్‌.. (65 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 116 పరుగులు). ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం. ఐపీఎల్‌-2022లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు.. 491 పరుగులు.. 3 సెంచరీలు.

చదవండి👉🏾కెప్టెన్‌ పిలిస్తే ఊపుకుంటూ వెళ్లడమేనా.. కుల్దీప్‌ను మెడపట్టి తోసిన చహల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement