సాక్షి, కదిరి: కూటమి సర్కార్ పాలనలో అ...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనా...
సోషల్ మీడియాలో కేంద్ర ఆర్థిక మంత్రి...
ఏపీలో గత ఐదేళ్లపాటు ప్రజా సంక్షేమమే �...
ఢిల్లీ: ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీత�...
విజయవాడ, సాక్షి: ఎన్డీయే కూటమి సర్కార...
ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వేళ దేశ రాజధ�...
ముఖ్యమంత్రిగా పదిహేనేళ్ల రికార్డు ఉ�...
ఢిల్లీ: పార్లమెంట్లో ఆర్థిక మంత్రి �...
న్యూఢిల్లీ, సాక్షి: అసంఘటిత రంగాల ఉద్�...
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్లో బడ్జెట�...
ఫిరాయింపు రాజకీయాలపై కేరళ ఉన్నత న్యా...
కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం క...
అట్టావా: టారిఫ్‌ల విషయంలో కెనడా, అమెర�...
వర్క్-లైఫ్ బ్యాలెన్సింగ్ గురించి ...
Published Thu, Apr 21 2022 7:01 PM | Last Updated on Fri, Apr 22 2022 7:18 AM
IPL 2022: సీఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ లైవ్ అప్డేట్స్
చివర వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై సీఎస్కే మూడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సీఎస్కే విజయానికి జయదేవ్ ఉనద్కత్ వేసిన అఖరి ఓవర్లో 17 పరుగులు కావల్సిన నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోని తనదైన శైలిలో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. వరుసగా ఒక సిక్స్, రెండు ఫోర్లు బాది సీఎస్కేను విజయతీరాలకు చేర్చాడు. ఇక 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే ఆదిలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ.. తరువాత రాయుడు, ఊతప్ప ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. సీఎస్కే బ్యాటర్లలో రాయుడు(40) ఊతాప్ప (30), ఎంస్ ధోని(28) పరుగులతో రాణించారు. ఇక ముంబై బౌలర్లలో డానియల్ సామ్స్ నాలుగు వికెట్లు సాధించగా.. జయదేవ్ ఉనద్కత్ రెండు, మెరిడిత్ ఒక వికెట్ సాధించాడు. అంతకుముందు ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన మంబై ఇండియన్స్‌ను తిలక్ వర్మ(51), సూర్యకుమార్ యాదవ్(32) అదుకున్నారు.
102 పరుగుల వద్ద చెన్నై సూపర్ కింగ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 40 పరుగులు చేసిన రాయుడు.. సామ్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. సీఎస్కే విజయానికి 30 బంతుల్లో 53 పరుగులు కావాలి.
66 పరుగుల వద్ద రాబిన్ ఊతప్ప రూపంలో సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన ఊతప్ప జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు సీఎస్కే స్కోర్ 68/3
156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. డానియల్ సామ్స్ బౌలింగ్‌లో రుత్‌రాజ్ గైక్వాడ్ డకౌట్ కాగా.. శాంట్నర్ 11 పరుగులు చేసి ఔటయ్యాడు. 3 ఓవర్లకు సీఎస్కే స్కోర్ 22/2
సీఎస్కేతో జరుగుతోన్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన మంబై ఇండియన్స్‌ను తిలక్ వర్మ(51), సూర్యకుమార్ యాదవ్(32) అదుకున్నారు.
సీఎస్కే బౌలర్లలో ముఖేష్ చౌదరి మూడు వికెట్లు పడగొట్టగా.. డ్వేన్ బ్రావో రెండు, శాంట్నర్, తీక్షణ చెరో వికెట్ సాధించారు.
వరుస క్రమంలో ముంబై రెండు వికెట్లు కోల్పోయింది. మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో పొలార్డ్ ఔట్ కాగా.. తరువాత ఓవర్ వేసిన బ్రావో బౌలింగ్‌లో సామ్స్ ఎల్బీగా వెనుదిరిగాడు. 18 ఓవర్లకు ముంబై స్కోర్: 127/7
ముంబై ఇండియన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన హృతిక్ షోకీన్.. డ్వేన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 15 ఓవర్లకు ముంబై స్కోర్ 100/5
47 పరుగుల వద్ద ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో ముఖేష్ చౌదరికు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 9 ఓవర్లకు ముంబై స్కోర్ 52/4
23 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ బ్రేవిస్ రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన బ్రేవిస్.. ముఖేష్ చౌదరి బౌలింగ్‌లో ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 4 ఓవర్లకు ముంబై స్కోర్ 27/3
సీఎస్కేకు పేసర్ ముఖేష్ చౌదరి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఒకే ఓవర్లో రోహిత్, ఇషాన్ కిషన్ డకౌట్లుగా వెనుదిరిగారు. క్రీజులో బ్రేవిస్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు
రోహిత్ శర్మ మరోసారి నిరాపరిచాడు. చెన్నైతో జరుగుతోన్న మ్యాచ్‌లో రోహిత్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ముఖేష్ చౌదరి బౌలింగ్‌లో మిచెల్ సాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఐపీఎల్-2022లో భాగంగా గురువారం డివై పాటేల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 32 మ్యాచ్‌లు జరగ్గా చెన్నై 19, ముంబై 13 మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేశాయి.
తుది జట్లు:
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్( వికెట్ కీపర్), డెవాల్డ్ బ్రీవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, డేనియల్ సామ్స్, హృతిక్ షోకీన్, రిలే మెరెడిత్, జయదేవ్ ఉనద్కత్, జస్ప్రీత్ బుమ్రా
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్ప, మిచెల్ సాంట్నర్, అంబటి రాయుడు, శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, డ్వేన్ ప్రిటోరియస్, మహీశ్ తీక్షణ, ముకేశ్ చౌదరి
Comments
Please login to add a commentAdd a comment