PC: IPL Twitter
ఐపీఎల్ 2023 సీజన్ చివరి అంకానికి చేరింది. రేపు (మే 28) జరుగబోయే ఫైనల్లో గుజరాత్, చెన్నై అమీతుమీ తేల్చుకోనున్నాయి. తుది సమరానికి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. అదేంటంటే.. ఐపీఎల్ 2023 ఎక్కడ, ఎలా మొదలైందో చివరకు అక్కడే, అలాగే ముగియనుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ మార్చి 31న నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్-సీఎస్‌కే జట్ల మధ్య జరగగా.. 57 రోజులు, 73 మ్యాచ్‌ల తర్వాత అదే వేదికపై, అవే జట్ల మధ్య మ్యాచ్‌తో క్యాష్ రిచ్ లీగ్ సీజన్ 16 ముగియనుంది.
31.03.2023 — Narendra Modi Stadium— GT v CSK
— Aakash Chopra (@cricketaakash) May 26, 2023
28.05.2023. Nearly two months later. After 73 games. We are back to where it started…and how it started. It’s a GT v CSK again…
So, why exactly did we play this season?? 🫣🤪 #TataIPL
ఫలితం కూడా ఒకేలా ఉంటుందా అన్న విషయాన్ని పక్కన పెడితే, యాధృచ్చికంగా జరిగిన ఈ ఆసక్తికర పరిణామం అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. ఈ విషయాన్ని ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ట్విటర్ ద్వారా షేర్ చేశాడు. ఇందుకు ఈ ఐపీఎల్ సీజన్ ఎందుకు ఆడాము అంటూ వ్యంగ్యంగా కామెంట్ జోడించాడు. ఈ ఆసక్తికర పరిణామంపై నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎక్కడ మొదలైందో అక్కడే, అలాగే ముగుస్తుందని కొందరు (గుజరాత్ గెలుస్తుందని).. ఎక్కడ, ఎలా మొదలైనా గెలిచేది తామేనని (సీఎస్‌కే గెలుస్తుందని) మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి సీజన్ తొలి మ్యాచ్‌లోలా గుజరాత్ గెలుస్తుందా.. లేక సీన్ రివర్స్ అయ్యి చెన్నై గెలుస్తుందా అనేది తెలియాలంటే రేపు అర్ధ రాత్రి వరకు వేచి చూడాలి.
కాగా, నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న (మే 26) జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్స్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. శుభ్‌మన్ గిల్ విధ్వంసకర శతకంతో (60 బంతుల్లో 129; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో తడబడిన ముంబై.. మోహిత్ శర్మ (5/10) ధాటికి 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. సూర్యకుమార్ (38 బంతుల్లో 61), తిలక్ వర్మ (14 బంతుల్లో 43) మెరుపులు వృధా అయ్యాయి.
చదవండి: గెలవదగిన ఆట ఆడలేదు.. శుభ్‌మన్ సూపర్, అదే మా ఓటమికి కారణం: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment