
ఐపీఎల్ 2024 సీజన్‌లో ఇవాళ (ఏప్రిల్ 17) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. గుజరాత్ టైటాన్స్ సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. గెలుపే లక్ష్యంగా ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. గుజరాత్, ఢిల్లీ జట్లు తామాడిన గత మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లపై సంచలన విజయాలు సాధించి జోష్‌లో ఉన్నాయి.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ ఆరో స్థానంలో (6 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) ఉండగా.. ఢిల్లీ తొమ్మిదో స్థానంలో (6 మ్యాచ్‌ల్లో 2 విజయాలు) కొనసాగుతున్నాయి. హెడ్ టు హెడ్ రికార్డ్స్‌ను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో తలపడగా.. గుజరాత్ 2, ఢిల్లీ ఓ మ్యాచ్‌లో విజయం సాధించాయి. ఇరు జట్ల మధ్య చివరి సారిగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీని విజయం వరించింది.
బలాబలాల విషయానికొస్తే.. ప్రస్తుత సీజన్‌లో రెండు జట్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఢిల్లీతో పోలిస్తే గుజరాత్ కాస్త మెరుగ్గా కనిపిస్తుంది. ఇరు జట్లలో ఇద్దరు విధ్వంసకర ఆటగాళ్లు వేర్వేరు కారణాల చేత గత కొన్ని మ్యాచ్‌లు దూరంగా ఉన్నారు. గుజరాత్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ గాయం కారణంగా.. ఢిల్లీ ప్లేయర్ మిచెల్ మార్ష్ వ్యక్తిగత కారణాల చేత అందుబాటులో లేరు. నేటి మ్యాచ్‌కు కూడా వీరిద్దరూ అందుబాటులో ఉండే విషయంపై క్లారిటీ లేదు.
తుది జట్లు (అంచనా)..
గుజరాత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), మాథ్యూ వేడ్ (వికెట్‌కీపర్), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్‌కీపర్), షాయ్ హోప్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment