
ఐపీఎల్ 2024లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ఇవాళ (మార్చి 24) జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ సంజూ శాంసన్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ.. వరుసగా ఐదు సీజన్ ఓపెనింగ్ మ్యాచ్‌ల్లో 50 అంతకంటే ఎక్కువ స్కోర్లు నమోదు చేసిన ఆటగాడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు.
SAMSON SHOW AT JAIPUR 🔥pic.twitter.com/Zj6devH0vU
— Johns. (@CricCrazyJohns) March 24, 2024
2020 సీజన్ ఓపెనర్‌లో సీఎస్‌కేపై 32 బంతుల్లో 74 పరుగులు చేసిన సంజూ.. ఆతర్వాత 2021లో పంజాబ్‌పై 119, 2022లో సన్‌రైజర్స్‌పై 55, 2023 సీజన్ ఓపెనర్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై 55, తాజా ఓపెనర్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 60 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఇలా సీజన్ ఓపెనింగ్ మ్యాచ్‌ల్లో వరుస 50 ప్లస్ స్కోర్లు సాధించడం చాలా అరుదుగా జరిగింది.
కాగా, లక్నోతో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ 16 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. యశస్వి జైస్వాల్ (24), జోస్ బట్లర్ (11), రియాన్ పరాగ్ ఔట్ కాగా.. సంజూ శాంసన్ (61), హెట్‌మైర్ (5) క్రీజ్‌లో ఉన్నారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 2 వికెట్లు పడగొట్టగా.. మొహిసిన్ ఖాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.