ఎంత పని చేశావు భరత్‌.... కోపంతో ఊగిపోయిన బుమ్రా! వీడియో వైరల్‌ | IND Vs ENG 1st Test Day 3: Jasprit Bumrah Loses Cool, Fumes At KS Bharat Over Poor DRS Call Video Goes Viral - Sakshi
Sakshi News home page

ENG Vs IND 1st Test: ఎంత పని చేశావు భరత్‌.... కోపంతో ఊగిపోయిన బుమ్రా! వీడియో వైరల్‌

Published Sat, Jan 27 2024 2:54 PM | Last Updated on Sat, Jan 27 2024 4:39 PM

Jasprit Bumrah Loses Cool, Fumes At KS Bharat Over Poor DRS Call - Sakshi

హైదరాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పేస్‌ గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా తన సహనాన్ని కోల్పోయాడు. మూడో రోజు ఆట సందర్భంగా భారత వికెట్‌ కీపర్‌ శ్రీకర్‌ భరత్‌పై బుమ్రా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అసలేం జరిగిందంటే?
ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 17 ఓవర్‌లో బుమ్రా.. బెన్‌ డకెట్‌కు అద్బుతమైన డెలివరీని సంధించాడు. ఆ బంతిని డకెట్‌ ఆఫ్‌ సైడ్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌కు మిస్స్‌ అయ్యి డకెట్‌ ప్యాడ్‌లకు తాకింది. వెంటనే బౌలర్‌తో పాటు వికెట్‌ కీపర్‌  ఎల్బీకి అప్పీల్‌ చేశాడు. కానీ అంపైర్‌ మాత్రం నాటౌట్‌ అంటూ తల ఊపాడు.

ఈ క్రమంలో బుమ్రా రివ్యూ తీసుకోమని కెప్టెన్‌ రోహిత్‌ శర్మను సూచించాడు. అయితే రోహిత్‌ వికెట్‌ కీపర్‌ కేఎస్ భరత్ సలహా ఇచ్చాడు. భరత్‌ మాత్రం బంతి లెగ్‌ సైడ్‌  వెళుతుందని రోహిత్‌ శర్మతో అన్నాడు. దీంతో రోహిత్‌ రివ్యూకు వెళ్లలేదు. కానీ తర్వాత రిప్లేలో బంతి లెగ్‌ స్టంప్‌ను తాకుతున్నట్లు తేలింది.

ఇది చూసిన బుమ్రా.. నేను చెప్పా కదా అది ఔట్‌ అని అన్నట్లగా రియాక్షన్‌ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఆ తర్వాత ఓవర్‌ వేసిన బుమ్రా.. డకెట్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు.
చదవండి: #INDvENG: పాపం జడ్డూ.. ఇది మరీ అన్యాయం!.. అంపైర్‌ను సమర్థించిన రవిశాస్త్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement