![Mohammed Shami become most wickets for India in World Cup - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/2/srilankawickets4.jpg.webp?itok=S2vIt7Ic)
వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో షమీ ఐదు వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 5 ఓవర్లు బౌలింగ్ చేసిన షమీ.. కేవలం 18 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అందులో ఒక మెయిడిన్ కూడా ఉంది.
మహ్మద్ షమీ అరుదైన ఘనత..
ఇక 5 వికెట్లతో చెలరేగిన షమీ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా షమీ నిలిచాడు. షమీ ఇప్పటివరకు వరల్డ్‌కప్ టోర్నీల్లో 45 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో భారత బౌలింగ్ దిగ్గజాలు జహీర్ ఖాన్, జవగాల్ శ్రీనాథ్‌ను షమీ అధిగమించాడు.
వీరిద్దరూ వన్డే వరల్డ్‌కప్‌లో సంయుక్తంగా 44 వికెట్లు పడగొట్టారు. ఇక ఈ టోర్నీలో ఇప్పటివరకు కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన షమీ 14 వికెట్లు పడగొట్టాడు. అందులో రెండు ఫైవ్ వికెట్లు హాల్, ఒక నాలుగు వికెట్ల హాల్ ఉంది.
సెమీఫైనల్లో భారత్..
వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో 302 పరుగుల తేడాతో శ్రీలంకను భారత్ చిత్తు చేసింది. ఈ విజయంతో సెమీఫైనల్స్‌కు టీమిండియా ఆర్హత సాధించింది. 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకేయులు 55 పరుగులకే చాపచుట్టేశారు. భారత బౌలర్లలో షమీతో పాటు సిరాజ్ మూడు, బుమ్రా, జడేజా ఒక్క వికెట్ సాధించారు.
చదవండి: World cup 2023: అయ్యో శుబ్‌మన్.. సెంచరీ జస్ట్ మిస్! సారా రియాక్షన్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment