ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆసక్తికరంగా మారింది. ట్రోఫీని గెలుచుకునేందుకు భారత్ 280 పరుగుల దూరంలో ఉండగా.. ఆస్ట్రేలియా గెలవాలంటే ఇంకా 7 వికెట్లు తీయాల్సి ఉంటుంది. 444 పరుగుల భారీ లక్ష్యంతో నాలుగో ఇన్నింగ్స్ బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 164 పరుగుల స్కోరు చేయగలిగింది. క్రీజులో విరాట్ కోహ్లి(44), రహానే(20) పరుగులతో ఉన్నారు.
కాగా ఐదు బంతుల వ్యవధిలో రోహిత్, పుజారా వికెట్లు కోల్పోయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లి, రహానే జోడి మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడారు. అదే విధంగా వీలు చిక్కినప్పుడు విరాట్ బంతిని బౌండరీకి తరలించాడు. కాగా వీరిద్దరిపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. వీరిద్దరి ఆటతో పాటు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న తీరు చూస్తే చివరి రోజు 280 పరుగులు చేయడం అసాధ్యమేమీ కాదు.
ఒక వేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే.. టెస్టు క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. టెస్టు క్రికెట్‌లో ఇంత భారీ టార్గెట్‌ను చేధించిన ఇప్పటివరకు సందర్బాలు లేవు. ఇక టెస్టు క్రికెట్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగుల లక్ష్య చేధన 418గా ఉంది. 2003లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ ఏడు వికెట్లు కోల్పోయి 418 పరుగుల టార్గెట్‌ను అందుకుంది.
విజయం మాదే: షమీ
ఇక ఆఖరి రోజు 280 పరుగులు సాధించి భారత్ చరిత్ర సృష్టిస్తుందని పేసర్ మహ్మద్ షమీ థీమా వ్యక్తం చేశాడు. నాలుగో రోజు ఆట అనంతరం విలేకురల సమావేశంలో షమీ మాట్లాడుతూ.. "బాగా బ్యాటింగ్ చేస్తే ఆఖరి రోజు 280 పరుగులేమీ పెద్ద లక్క్ష్యం కాదు. ఒత్తడి లేకుండా సాధారణ టెస్టు మ్యాచ్ లాగా బ్యాటింగ్ చేయాలి. బాల్ టూ బాల్ రన్ వచ్చేలా ఆడాలి.
టార్గెట్‌ను దృష్టిలో ఉంచుకుని మంచి బాగస్వామ్యాలని నమోదు చేస్తే చాలు. ఈ మ్యాచ్‌లో మేము విజయం సాధిస్తామని వంద శాతం నమ్మకం ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు అందరం కలిసికట్టుగా ఆడుతాము. నేను కూడా బ్యాటింగ్ చేసేందుకు సిద్దంగా ఉన్నాను. మేము చాలా మ్యాచ్‌ల్లో పోరాడి గెలిచాం. ఇంగ్లండ్‌లోనే కాకుండా విదేశీ గడ్డలపై మేము అద్భుత విజయాలు నమోదు చేశాం. అదే స్పూర్తితో ముందుకు వెళ్తామని" చెప్పుకొచ్చాడు.
చదవండి: WTC FINAL: గిల్‌ది అవుటా.. నాటౌటా? రోహిత్ రియాక్షన్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment