విలియమ్సన్- కోహ్లి (ఫైల్ ఫొటోలు)
New Zealand vs Australia, 2nd Test: న్యూజిలాండ్ దిగ్గజ బ్యాటర్ కేన్ విలియమ్సన్ తన కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాతో తాజా సిరీస్ రెండో టెస్టు సందర్భంగా ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఈ అరుదైన మైలురాయికి చేరుకున్నాడు.
కెరీర్‌లోని ప్రత్యేక మ్యాచ్‌లో బ్యాట్ ఝులిపించి కేన్ మామ సత్తా చాటుతాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. కేవలం 17 పరుగులు మాత్రమే చేసి విలియమ్సన్ నిష్క్రమించాడు. ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు.
కోహ్లి రికార్డు బ్రేక్ చేసిన విలియమ్సన్
ఇలా కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితమైప్పటికీ.. కేన్ విలియమ్సన్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో పదకొండో స్థానానికి చేరుకున్నాడు.
ఈ క్రమంలో టీమిండియా స్టార్ క్రికెటర్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లిని అధిగమించాడు. డబ్ల్యూటీసీలో కేన్ మామ ఇప్పటి వరకు 2238 పరుగులు చేయగా.. కోహ్లి ఖాతాలో 2235 పరుగులు ఉన్నాయి.
తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు కోహ్లి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రన్‌మెషీన్ పరుగుల విషయంలో కేన్ కంటే వెనుకబడ్డాడు. ఇదిలా ఉంటే.. విలియమ్సన్‌తో పాటు న్యూజిలాండ్ టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ సౌతీకి కూడా ఇది వందో టెస్టు కావడం విశేషం.
డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు వీరులు టాప్-5
1. జో రూట్- ఇంగ్లండ్- 52* మ్యాచ్‌లు- 4223 పరుగులు
2. మార్నస్ లబుషేన్- ఆస్ట్రేలియా- 45* మ్యాచ్‌లు- 3808 పరుగులు
3. స్టీవ్ స్మిత్- ఆస్ట్రేలియా- 45* మ్యాచ్‌లు- 3466 పరుగులు
4. బెన్ స్టోక్స్- ఇంగ్లండ్- 45* మ్యాచ్‌లు- 2907 పరుగులు
5. బాబర్ ఆజం- పాకిస్తాన్- 29 మ్యాచ్‌లు- 2661 పరుగులు.
Comments
Please login to add a commentAdd a comment