
World Cup 2023: క్రికెట్ ప్రేమికులకు అదిరిపోయే శుభవార్త. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కు వేదిక ఖరారైనట్లు సమాచారం. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం దాయాది దేశాల మెగా ఫైట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఇండియా- పాకిస్తాన్ ముఖాముఖి పోరుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలిరానున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అందుకే అక్కడ
ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌కు లక్ష సీట్ల సామర్థ్యం ఉన్న అహ్మదాబాద్ స్టేడియమే సరైన వేదిక అని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రచురించింది. ఐపీఎల్-2023 సీజన్ ముగిసిన తర్వాత వరల్డ్‌కప్ ఈవెంట్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో #IndVsPak హ్యాష్‌ట్యాగ్ నెట్టింట వైరల్‌గా మారింది.
అప్పటి నుంచే ఆరంభం!
బీసీసీఐ ఐసీసీకి ఇచ్చిన వివరాల్లో అక్టోబరు 5 నుంచి ఈవెంట్ ప్రారంభం కానున్నట్లు వార్తలు వెలువడ్డాయి. మొత్తంగా 10 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో 46 రోజులపాటు 48 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అహ్మదాబాద్‌తో పాటు ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా సమా 11 నగరాలు ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు సమాచారం.
ఎటూ తేలని పంచాయతీ!
ఇదిలా ఉంటే.. ఆసియా కప్-2023 నిర్వహణ హక్కులు పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియాను అక్కడికి పంపేందుకు బీసీసీఐ ససేమిరా అంటున్న క్రమంలో.. వరల్డ్‌కప్ ఆడేందుకు తాము కూడా ఇండియాకు రాలేమని పీసీబీ గతంలో పేర్కొంది. ఈ క్రమంలో ఆసియా కప్-2023లో భారత్- పాక్ మ్యాచ్ నిర్వహణపై సందిగ్దం వీడిన తర్వాతే ప్రపంచకప్ ఈవెంట్‌లో ఈ మెగా పోరుపై స్పష్టతరానుంది.
చదవండి: లక్షలు పోసి కొంటే రెట్టింపు తిరిగి ఇస్తున్నాడు! 4 కోట్లు తీసుకున్న నువ్విలా.. వేస్ట్
Updates for ODI World Cup 2023:- (To Indian Express)
— CricketMAN2 (@ImTanujSingh) May 5, 2023
•IND vs PAK at Ahmedabad.
•IND vs AUS likely at Chepauk.
•BCCI grand launch schedule after IPL.
•14 venues for World Cup.
•Pakistan majority match on Bengalore & Chennai
•Bangladesh majority match on Kolkata & Guwahati.
Comments
Please login to add a commentAdd a comment