ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన యాషెస్ తొలి టెస్టులో 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. బాజ్ బాల్ అంటూ విర్రవీగిన ఇంగ్లీష్ జట్టుకు ఆసీస్ కళ్లేం వేసింది. ఆసీస్ విజయంలో ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కీలక పాత్ర పోషించాడు.
ఇంగ్లండ్ బౌలర్లు నిప్పులు చేరుగుతున్న వేళ కమ్మిన్స్ (73 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుతమైన పోరాటంతో తన జట్టు చిరస్మరణీయ విజయం అందించాడు. ఇక విజయంపై మ్యాచ్ అనంతరం ఆసీస్ కెప్టెన్స్ ప్యాట్ కమ్మిన్స్ స్పందిచాడు. ఉత్కంఠ పోరులో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని కమ్మిన్స్ తెలిపాడు.
"ఎడ్జ్‌బాస్టన్‌లో మాకు సపోర్ట్ చేసే వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎటువైపు చూసిన ఇంగ్లీష్ జట్టుకు మద్దతుగా ఉన్నవారే. అటువంటి చోట మేము విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను బ్యాటింగ్‌కు వచ్చేటప్పుడు మాకు గెలిచే ఛాన్స్‌లు ఉన్నాయి అని భావించాను. అందుకే డ్రా అనే పదాన్ని నా మైండ్‌లో పెట్టుకోలేదు. పిచ్ కూడా బ్యాటింగ్ అద్బుతంగా అనుకూలిస్తోంది.
నా కంటే ముందు కారీ కూడా అద్భుతంగా ఆడాడు. అదే విధంగా నాథన్ లయోన్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడు ఆడిన కవర్ డ్రైవ్ షాట్ చూసి ఆశ్చర్యపోయాను. అతడి దగ్గరకు వెళ్లి "నైస్ షాట్" నాథన్ అంటూ ప్రశంసించాను. మేము ఈ మ్యాచ్‌లో మా స్థాయికి తగ్గట్టు ఆడాము. ఇక ఖ్వాజా గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అతడొక క్లాస్ ప్లేయర్. అతడు ఎటువంటి ఆటగాడో గత కొన్నేళ్లగా మనం చూస్తునే ఉన్నాం. చివరగా మేము అన్ని విభాగాల్లో రాణించి విజయం సాధించాం. కెప్టెన్‌గా నాకు ఇంతకు మించి ఏమి కావాలి" అంటూ పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు. ఇరు జట్ల మధ్య 28 నుంచి లార్డ్స్‌లో రెండో టెస్టు జరుగుతుంది.
చదవండి: #Ashes2023: చావుదెబ్బ కొట్టిన ఆసీస్.. రికార్డులు బద్దలైన వేళ
Comments
Please login to add a commentAdd a comment