వన్డే ప్రపంచకప్-2023కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. స్టార్ ఆటగాడు, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా వన్డే ప్రపంచకప్‌కు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. వెన్నునొప్పితో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలో జట్టుకు దూరమైన అయ్యర్.. ఆ తర్వాత న్యూజిల్యాండ్ వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అనంతరం బెంగళూరులోని ఏన్‌సీఏలో రీహాబిలిటేషన్‌లో ఫిట్‌నెస్ సాధించే పనిలో పడ్డాడు.
ఈ క్రమంలో భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌తో అయ్యర్ రీ ఎంట్రీ ఇస్తాడని అంతా భావించారు. కానీ అయ్యర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరికొంత సమయం పడుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. శ్రేయస్ ఇప్పటికీ వెన్ను నొప్పికి ఇంజక్షన్‌లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. "అయ్యర్ నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ప్రపంచకప్ సమయానికి అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని మేము ఆశిస్తున్నాము.
కానీ అది జరిగేలా లేదు. ఎందుకంటే అతడు ఇప్పటికీ తన నొప్పికి ఇంజక్షన్‌లు తీసుకుంటున్నాడు" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్‌సైడ్ స్పోర్ట్‌తో పేర్కొన్నారు. అదే విధంగా ఏన్సీఏలో ఉన్న స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా ఆసియాకప్-2023 సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉందని సదరు అధికారి తెలిపారు.
చదవండి: ICC World Cup 2023: కోల్‌కతాలో పాకిస్తాన్ మ్యాచ్‌లు.. భారీ భద్రతా ఏర్పాట్లు: గంగూలీ
Comments
Please login to add a commentAdd a comment