
వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల్లో పెద్దగా ఆకట్టుకోకపోయిన అయ్యర్.. శ్రీలంక, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో మాత్రం కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. శ్రీలంకపై 82 పరుగులు చేసిన అయ్యర్.. సౌతాఫ్రికాపై 77 పరుగులతో అదరగొట్టాడు.
ఇక ఈ మెగా టోర్నీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో నవంబర్ 12న బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్‌తో టీమిండియా తలపడనుంది. ఇప్పటికే బెంగళూరుకు చేరుకున్న రోహిత్ సేన ప్రాక్టీస్ సెషన్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ క్రికెట్ బ్యాట్‌తో కాకుండా బేస్‌బాల్ బ్యాట్‌తో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.
తన మణికట్టు పవర్‌ను పెంచుకోవడానికి బేస్‌బాల్ బ్యాట్‌తో అయ్యర్ ప్రాక్టీస్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ టోర్నీలో ఆడిన 8 మ్యాచ్‌ల్లో గెలిచిన టీమిండియా.. తమ సెమీస్ స్ధానాన్ని ఇప్పటికే సుస్ధిరం చేసుకుంది.
చదవండి: ODI World Cup 2023: చరిత్ర సృష్టించిన ట్రెంట్ బౌల్ట్.. తొలి కివీస్ బౌలర్‌గా
Shreyas Iyer with the baseball bat#ShreyasIyer #RohitSharma𓃵 #ViratKohli #CWC23INDIA #abhiya #elvisha #abhisha #INDvsENG #CricketWorldCup #CricketWorldCup2023 pic.twitter.com/QxwTb4r0Bh
— Virat Kohli(parody) (@harshraj5056) November 9, 2023
Comments
Please login to add a commentAdd a comment