న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌కే విజయావకాశాలు ఉన్నాయని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న కోహ్లి జట్టు 3–2తో సిరీస్ నెగ్గే చాన్స్ ఉందని ద్రవిడ్ అన్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ తర్వాత ఇంగ్లండ్‌తో సిరీస్‌కు సన్నద్ధమయ్యేందుకు భారత్‌కు నెలరోజుల సమయం ఉండనుందని ద్రవిడ్ గుర్తు చేశాడు. టీమిండియా ‘వాల్’గా పేరుగాంచిన ద్రవిడ్ కెప్టెన్సీలోనే భారత జట్టు చివరిసారి 2007లో ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్ గెలిచింది.
ఓ వెబినార్‌లో ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘‘భారత్ ముందు మంచి అవకాశం ఉంది. ప్రస్తుత జట్టుకు గెలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పోటాపోటీగా సాగే ఒక గొప్ప సిరీస్‌ను చూడబోతున్నాం’’ అని పేర్కొన్నాడు. కాగా ఐదు మ్యాచ్ టెస్టు సిరీస్ నిమిత్తం టీమిండియా ఆగష్టు- సెప్టెంబరులో ఇంగ్లండ్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment