ముంబై: మాజీ క్రికెటర్, ప్రముఖ కోచ్ వాసు పరంజపే సోమవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. వాసు.. 1956-1970 మధ్య ముంబై, బరోడా జట్ల తరఫున 29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 23.78 సగటుతో 785 పరుగులు చేశాడు. వాసు.. బాంబేలోని దేశీయ క్రికెట్‌లో దాదర్ యూనియన్‌కు ప్రాతినిధ్యం వహించేవాడు. ఈ జట్టు బాంబేలో అత్యంత శక్తివంతమైన జట్లలో ఒకటి.
I feel that a piece of me has left the world.
— Sachin Tendulkar (@sachin_rt) August 30, 2021
Rest in Peace Vasu Sir. 🙏 pic.twitter.com/0ynyJ7LQNu
ఆటగాడిగా విరమణ పొందిన తర్వాత వాసు కోచ్‌గా మారారు. సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, రవిశాస్త్రి, వినోద్ కాంబ్లి, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ లాంటి చాలా మంది క్రికెటర్లకు మెలకువలు నేర్పాడు. అంతేకాదు వాసు అనేక జట్లకు కోచ్‌గా, జాతీయ క్రికెట్ అకాడమీకి కోచ్‌గా సేవలనందించారు. వాసు మరణం పట్ల సచిన్, రోహిత్ సహా చాలామంది ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా, వాసు కుమారుడు జతిన్ పరంజపే కూడా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. జతిన్ కొంతకాలం జాతీయ సెలెక్టర్‌గా కూడా వ్యవహరించాడు.
చదవండి: ఒకే గ్రూప్‌లో తలపడనున్న కోహ్లి, రోహిత్, కేఎల్ రాహుల్ జట్లు
Comments
Please login to add a commentAdd a comment