
సౌతాఫ్రికాతో టి20 సిరీస్ ద్వారా రిషబ్ పంత్ టీమిండియా టి20 కెప్టెన్‌గా అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. గాయంతో కేఎల్ రాహుల్ టి20 సిరీస్‌కు దూరం కావడంతో అతని స్థానంలో పంత్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఈ నేపథ్యంలోనే గురువారం సౌతాఫ్రికాతో తొలి టి20 మ్యాచ్‌లో కెప్టెన్‌గా పంత్ అరుదైన ఘనత సాధించాడు.
అత్యంత పిన్న వయసులో టీమిండియా తరపున టి20 కెప్టెన్ అయిన ఆటగాడిగా పంత్ రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం పంత్ వయస్సు 24 ఏళ్ల 248 రోజులు. ఇక తొలి స్థానంలో సురేశ్ రైనా 23 ఏళ్ల 197 రోజులు, ఎంఎస్ ధోని 26 ఏళ్ల 68 రోజులతో మూడో స్థానంలో, అజింక్యా రహానే 27 ఏళ్ల 41 రోజులతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
చదవండి: Ishan Kishan : అదృష్టం బాగుంది.. ముగ్గురు ఒకేసారి పరిగెత్తుకొచ్చినా
European T10 League: హతవిధి.. నవ్వాలో ఏడ్వాలో అర్థం కాని స్థితిలో!