చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. తొలి భారత క్రికెటర్‌గా | Rohit sharma Becomes First Indian batter to HAMMER 250 sixes | Sakshi
Sakshi News home page

IPL 2023: చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. తొలి భారత క్రికెటర్‌గా

Published Sun, Apr 23 2023 7:51 AM | Last Updated on Sun, Apr 23 2023 7:55 AM

Rohit sharma Becomes First Indian batter to HAMMER 250 sixes  - Sakshi

Photo Credit : IPL Twitter

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌ చరిత్రలో 250 సిక్సర్లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా రోహిత్‌ రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు సిక్సర్ల బాదిన హిట్‌మ్యాన్‌.. ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో 37 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌.. 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44 పరుగులు చేశాడు. ఇక ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో విండీస్‌ దిగ్గజం క్రిస్‌ గేల్‌ 357 సిక్స్‌లతో తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో ఏబీ డివిలియర్స్‌(251), రోహిత్‌(250) కొనసాగుతున్నారు.

ఉత్కంఠ పోరులో ముంబై ఓటమి..
ఆఖరి వరకు పంజాబ్‌ కింగ్స్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ ఓటమి పాలైంది. 215 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 201 పరుగులు మాత్రమే చేసింది.

ముంబై బ్యాటర్లలో ‍గ్రీన్‌(67), సూర్యకుమార్‌ యాదవ్‌(57), రోహిత్‌ శర్మ(44) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ.. విజయం మాత్రం పంజాబ్‌నే వరించింది. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది.
చదవండి: #ArshdeepSingh: జాగ్రత్త..  అక్కడ వికెట్లు విరిగిపోతున్నాయ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement