ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. రోహిత్‌ శర్మ సంచలన నిర్ణయం..!? | Rohit Sharma Out Of IPL 2024?; Check Here Stunning Update - Sakshi
Sakshi News home page

IPL 2024: ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. రోహిత్‌ శర్మ సంచలన నిర్ణయం..!?

Published Sat, Mar 9 2024 4:29 PM | Last Updated on Sat, Mar 9 2024 5:04 PM

Rohit Sharma out of IPL 2024? - Sakshi

ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌, ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఆటగాడు రోహిత్‌ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ ఫస్ట్‌ హాఫ్‌కు దూరంగా ఉండాలని రోహిత్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రోహిత్‌ శర్మ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టు మూడో రోజు ఆటకు రోహిత్‌ ఫీల్డింగ్‌కు సైతం రాలేదు. 

హిట్‌మ్యన్‌ వెన్ను నొప్పితో బాధపడతున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే అమెరికా, వెస్టిండీస్‌ వేదికగా మరో మూడు నెలలలో టీ20 వరల్డ్‌కప్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ ఆరంభ సమయానికి పూర్తి ఫిట్‌నెస్‌గా ఉండాలని హిట్‌మ్యాన్‌ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉండాలని రోహిత్‌ ఫిక్స్‌ అయినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అయితే ఈ లీగ్‌లో సెకండ్‌ హాఫ్‌కు రోహిత్‌ అందుబాటులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది.

కాగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ తమ జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్‌ శర్మను తప్పించిన సంగతి తెలిసిందే. రోహిత్‌ స్ధానంలో భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను తమ జట్టు పగ్గాలను ముంబై అప్పగించింది. గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి హార్దిక్‌ను ముంబై ట్రేడింగ్‌ చేసుకుంది. ఇక మార్చి 22 నుంచి ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెపాక్‌ వేదికగా ఆర్సీబీ, చెన్నై జట్లు తలపడనున్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement