ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య నిన్న (ఏప్రిల్ 14) జరిగిన మ్యాచ్ సందర్భంగా ఓ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. చెన్నై ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ పట్టుకునే క్రమంలో రోహిత్ శర్మ ప్యాంట్ జారిపోయింది. క్యాచ్ కోసం హిట్‌మ్యాన్ శాయశక్తులా ప్రయత్నించినా అది దొరకపోగా ప్యాంట్ జారిపోయింది.
కిందపడిన బంతిని త్రో చేసిన అనంతరం రోహిత్ తన ప్యాంట్‌ను సర్దుకున్నాడు. ఈ ఫన్నీ ఇన్సిడెంట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. రోహిత్ కమిట్‌మెంట్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. లేటు వయసులో హిట్‌మ్యాన్ క్యాచ్ కోసం శాయశక్తులా ప్రయత్నించాడని కితాబునిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ అజేయ సెంచరీతో (63 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) కదంతొక్కినప్పటికీ ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది.
Chaddhi khol performance 🔥 pic.twitter.com/xxgWKCWOpV
— GoodMan🇮🇳 (@GoodMan_DHONI) April 14, 2024
తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే.. రుతురాజ్ (40 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), శివమ్ దూబే (38 బంతుల్లో 66 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్‌లో ధోని సుడిగాలి ఇన్నింగ్స్‌తో శివాలెత్తిపోయాడు. ఇన్నింగ్స్‌లో చివరి నాలుగు బంతులు మిగిలున్నప్పుడు బరిలోకి దిగిన ధోని.. హ్యాట్రిక్ సిక్సర్లు సహా 20 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్‌లో సీఎస్‌కే ఏకంగా 26 పరుగులు పిండుకుని భారీ స్కోర్ చేసింది.
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రోహిత్ శర్మ శతక్కొట్టినప్పటికీ లక్ష్యానికి 21 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. ధోని ఆఖరి ఓవర్‌లో చేసిన 20 పరుగులే ముంబై, సీఎస్‌కే స్కోర్లకు వ్యత్యాసం కావడం విశేషం. ఆఖరి ఓవర్‌లో 26 పరుగులు సమర్పించుకుని ముంబై ఓటమికి ప్రధాన కారణంగా నిలిచిన హార్దిక్‌పై ముంబై అభిమానులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. 4 వికెట్లు తీసిన పతిరణ సీఎస్‌కే గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment