
ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు సరైన ఆరంభం లభించలేదు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంత్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. పంత్‌కున్న షార్ట్ బాల్ బలహీనతను ముంబై ఇండియన్స్ పసిగట్టేసింది. అయితే దీని వెనుక రోహిత్ శర్మ హస్తం ఉందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టైమల్ మిల్స్ మొదటి బంతిని వైడ్ వేశాడు. రెండో బంతి వేయడానికి ముందు రోహిత్ ఫీల్డింగ్ సెట్ చేశాడు.
రోహిత్ ముందే ఊహించాడేమో తెలియదు కానీ మిల్స్ రెండో బంతి విసరడానికి ముందే టిమ్ డేవిడ్‌ను థర్డ్‌మన్ దిశలో ఉంచాడు. కాగా టైమల్ మిల్స్ ఎక్స్‌ట్రా బౌన్స్‌తో విసిరిన బంతిని పంత్ థర్డ్‌మన్ దిశగా భారీ షాట్ ఆడాడు.అంతే బంతి నేరుగా వెళ్లి టిమ్ డేవిడ్ చేతిలో పడింది. పంత్ బలహీనత తెలిసిన రోహిత్ సంబరాల్లో మునిగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment