వరల్డ్‌కప్ సన్నాహాకాల్లో భాగంగా భారత జట్టు స్వదేశంలో మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. సెప్టెంబర్ 22న మొహాలీ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఈ సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది.
అయితే తొలి రెండు వన్డేలకు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. మళ్లీ వీరు ముగ్గురు తిరిగి మూడో వన్డేకు అందుబాటులోకి రానున్నారు. ఇక తొలి రెండు మ్యాచ్‌ల్లో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ భారత జట్టుకు సారథ్యం వహించనున్నాడు.
అశ్విన్ రీ ఎంట్రీ..
కాగా ఎవరూ ఊహించని విధంగా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఆసీస్ సిరీస్ జట్టులో సెలక్టర్లు చోటు కల్పించారు. అశూ దాదాపు 20 నెలల తర్వాత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. అశ్విన్ చివరిసారిగా 2022లో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆడాడు. ఇక అశ్విన్‌కు చోటు దక్కడంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.
అశ్విన్ ఎంత అనుభవజ్ఞుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు ఇప్పటికే 113 వన్డేలు, 94 టెస్టులు ఆడాడు. అశ్విన్ ఎప్పుడూ మా దృష్టిలో ఉంటాడు. అతడు మాకు మంచి ఎంపిక. అతడు గత కొంత కాలంగా వన్డే ఫార్మాట్‌లో ఆడకపోవచ్చు.
కానీ దేశీవాళీ టోర్నీలతో పాటు టెస్టు క్రికెట్‌లో బాగా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌కు అతడికి మంచి అవకాశం. అతడు ఏ స్థాయిలో ఉన్నాడో ఈ సిరీస్‌లో మాకు సమాధానం దొరుకుతుందని రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు.
ఆసీస్‌తో తొలి రెండు వన్డేలకు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
ఆసీస్‌తో మూడో వన్డేకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
చదవండి: Asia Cup 2023: పాక్ క్రికెట్‌లో ముసలం.. బాబర్‌తో విభేదాలు! వైస్ కెప్టెన్‌పై వేటు
Comments
Please login to add a commentAdd a comment